ఈ నెల 22వ తారీఖు నుండి ప్రారంభం కావలసిన ‘ధని ఒరువన్’ రీమేక్ షూటింగ్ షెడ్యూల్ ఆఖరి నిముషంలో రామ్ చరణ్ వాయిదా వేయడంతో ఈ సినిమాను నిర్మిస్తున్న అల్లుఅరవింద్ షాక్ అవ్వడమే కాకుండా చరణ్ పై తీవ్ర అసంతృప్తితో అరవింద్ ఉన్నాడు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఈసినిమా షెడ్యూల్ కోసం అరవింద్ స్వామి చెన్నై నుండి హైదరాబాద్ కు చేరుకున్న తరువాత చరణ్ ఈ సినిమా షూటింగ్ ను ఆఖరి నిముషంలో  వాయిదా వేయడంతో అరవింద్ స్వామికి కూడ తీవ్ర అసహనం కలిగినట్లు టాక్.

దీనితో కోపగించుకున్న అరవింద్ స్వామి తాను తెలుగు రీమేక్ లో నటించడానికి ఇష్టపడకపోయినా బలవంతగా ఒప్పించి ఇలా సినిమా షూటింగ్ ను వాయిదాలపై వాయిదాలు వేస్తూ ఉంటే ఈసినిమాకు తాను సహకరించలేనని అరవింద్ స్వామి అల్లు అరవింద్ కు చెప్పినట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు వరస పెట్టి వాయిదాలు పడుతూ ఉండటంతో ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఆశీమ్ మిశ్రా ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అతడి స్థానంలో పి.ఎస్. వినోద్ ను ఎంపిక చేసినట్లు టాక్.

ఫిలింనగర్ లో వినపడుతున్న లేటెస్ట్ సమాచారంమేరకు ఈసినిమా షూటింగ్ ను జూన్ 2నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ సన్నిహితులు చెపుతున్న సమాచారం వేరే విధంగా ఉంది అని అంటున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ సినిమాలు ఘోర పరాజయం చెందిన నేపధ్యంలో చిరంజీవి తన 150వ సినిమా ‘కత్తి లాంటోడు’ స్క్రిప్ట్ విషయంలో మరోసారి కూర్చుని చర్చిద్దాం అన్న ఆలోచనతో ఉండటంతో చరణ్ తన ‘ధని ఒరువన్’ విషయంలో ఊహించని ఈ నిర్ణయం  తీసుకున్నాడు అని అంటున్నారు. 

ప్రేక్షకుల అభిరుచి మారిపోయిన నేపధ్యంలో సెంటిమెంట్ కథలతో ఉన్న సినిమాల కన్నా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో చిరంజీవి తన గత బ్లాక్ బస్టర్ మూవీ ‘ఠాగూర్’ రేంజ్ లో ‘కత్తి లాంటోడు’ సినిమాలో సీన్స్ ఉండాలి అని చిరంజీవి దర్శకుడు వినాయక్ కు గట్టిగా సూచించిన నేపధ్యంలో ‘కత్తి లాంటోడు’ కోసం చరణ్ తన ‘ధని ఒరువన్’ ను మళ్ళీ వెనక్కు పెట్టాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: