ఈమధ్య కాలంలో పివిపి నిర్మాణ సంస్థకు సంబధించి వార్తలు లేకుండా మీడియా ఉండటం లేదు. ఎప్పటి నుంచో తరతరాలుగా సినిమాలు తీస్తున్న అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడ పివిపి స్పీడ్ ముందు ఆగలేక పోతున్నాయి. సినిమా నిర్మాణం తనకు ఒక వ్యాపారం కాదు ఒక అభిరుచి అంటూ వరస పెట్టి సినిమాలు తీస్తున్న పివిపి సంస్థకు ఇప్పటి వరకు ఆ సంస్థ తీసిన సినిమాల వల్ల 100 కోట్ల నష్టం వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలలో ఎన్ని నిజలో తెలియక పోయినా ఈ వార్హలు ఇలా రావడానికి ఒక కారణం ఉంది. 2011లో ఒక తమిళ సినిమా తీయడం ద్వారా సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చిన పివిపి ఆ తరువాత తీసిన సినిమాల్లో ‘వర్ణ’ ‘సైజ్ జీరో’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు సంబంధించి భారీ స్థాయిలో నష్టాలు రావడంతో పివిపి సంస్థ పై  ఇప్పుడు ఈ రూమర్స్ ఇలా హడావిడి చేస్తున్నాయి అనుకోవాలి. ఈ సంస్థ రావితేజాతో నిర్మించిన ‘బలుపు’ ఏవరేజ్ సక్సస్ గా మారడంతో పాటు ఇదే సంస్థ నిర్మించిన ‘ఊపిరి’ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఈసినిమా పై ఖర్చు పెట్టిన భారీ బడ్జెట్ వల్ల పివిపికి ‘ఊపిరి’ బల్ల కలిసి వచ్చింది లేదు అని అంటున్నారు. 

అయితే ఇన్ని భారీ సినిమాల మధ్య పివిపి నిర్మించిన ఒక్క ‘క్షణం’ మాత్రమే సక్సస్ సాధించిన నేపధ్యంలో పివిపికి వ్యాపారాలలో కలిసి వచ్చినట్లుగా సినిమాలు కలిసి రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే వినపడుతున్న వార్తల ప్రకారం వంద కోట్ల నష్టం పివిపి సంస్థకు ఏ మాత్రం హాని చేయలేదని అని అంటున్నారు. దీనికి కారణం ఈ సంస్థకు వివిధ వ్యాపారాలలో ఉన్న వందలాది కోట్ల పెట్టుబడులు.

అయితే టాలీవుడ్ సినిమా రంగాన్ని ఒక కార్పోరేట్ రంగంగా మారుద్దామని పివిపి లాంటి సంస్థలు చేసిన ప్రయత్నాలు వికటించడంతో భవిష్యత్ లో  పెద్దపెద్ద వ్యాపార వేత్తలు కార్పోరేట్ కంపెనీలు సినిమా రంగం వైపు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: