ఒకవైపు వరస పరాజయాలతో సతమతమైపోతున్న సునీల్ కు మెగా కాంపౌండ్ నుండి తిరస్కరణ ఎదురైంది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమా ‘కత్తి లాంటోడు’ సినిమాకు నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతున్న నేపధ్యంలో సునీల్ విషయంలో మెగా కాంపౌండ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది అని టాక్. 

హీరోగా అనుకున్న సక్సస్ రేంజ్ ని అందుకోలేక పోవడంతో సునీల్ తిరిగి తన కామెడీ పాత్రలను చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయమై సునీల్ తనకు బాగా సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఒక కామెడీ క్యారెక్టర్ చేస్తాను అని స్వయంగా సునీల్ అడిగినా త్రివిక్రమ్ సున్నితంగా సునీల్ కోరికను తిరస్కరించినట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. 

దీనితో సునీల్ ఎట్టి పరిస్తుతులలోను కమెడియన్ గా తిరిగి తన రీ ఎంట్రీకి చిరంజీవి 150వ సినిమాను అస్త్రంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా చిరంజీవి ఆశీస్సులను సునీల్ పొందడంతో చిరంజీవి 150వ సినిమాలో సునీల్ కమెడియన్ రీ ఎంట్రీ ఖాయం అని అనుకున్నారు అంతా. అయితే నటీనటుల ఎంపిక విషయం వచ్చే సరికి ‘కత్తి లాంటోడు’ సినిమాలో సునీల్ చేయబోయే పాత్రను అతడి కంటే వెన్నెల కిషోర్ బాగా చేస్తాడు అన్న ఆలోచన రావడంతో వ్యూహాత్మకంగా సునీల్ ను తప్పించి వెన్నెల కిషోర్ కు అవకాశం ఇస్తున్నారు అని టాక్.

అయితే సునీల్ సన్నిహితులు మాత్రం ఈ విషయమై మరో విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 5 నుంచి ప్రారంభం కాబోతున్న చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి దాదాపు 40 రోజులపాటు డేట్స్ సునీల్ ను అడిగారని, ఆ టైమ్‌లో సునీల్ తన మూవీల్లో బిజీగా ఉండటంతో ‘కత్తి లాంటోడు’ మూవీలో చాన్స్ మిస్ అయ్యాడు అనే వార్తలను సునీల్ సన్నిహితులు ప్రచారంలోకి తీసుకు వస్తున్నట్లు టాక్. ఏమైనా సునీల్ మరో గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: