బాలీవుడ్ హీరోయిన్స్ కు ఉండే గిరాకి మాములుగా ఉండదు.. వరుసెంట హిట్లు కొట్టినా కొట్టక పోయినా బీ టౌన్ హాట్ హీరోయిన్స్ ఎప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదిస్తుంటారు. ఇక హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన వారైతే ఇక అసలు ఆగరనుకోండి. ప్రస్తుతం బాలీవుడ్ లక్కీ గాళ్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ క్వాంటికో సీరీస్ లో నటిస్తూ ఫుల్ ఫాంలో ఉంది. ఇక్కడ లిప్ లాక్ వరకు ఓకే చెప్పేందుకే సంశయించే ఈ భామ అక్కడ సర్వస్వం దారపోస్తుంది.  


క్వాంటికో సీరీస్ లో హాట్ ప్రియాంక :


ఇక బేచావ్ సినిమాలో కూడా నటిస్తున్న పిర్యాంకా 40 డేస్ హాలీ డే ట్రిప్ కు ఇండియా వస్తుందట. కొంతకాలంగా హాలీవుడ్ సీరియల్స్ కోసం ఫారిన్ లో ఉంటున్న ఈ అమ్మడు త్వరలోనే ఇండియాకు రానుంది. అయితే ఈ 40 రోజుల్లో కూడా ప్రియాంకా మరో 100 కోట్ల రూపాయలను తన యాడ్స్ ద్వారా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుందట.


ఇండియాలో ఉండే 40 రోజుల్లో 24 కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు చేయాల్సిందిగా తనను అడిగారట. అన్నిటికి ఓకే చెప్పిన ప్రియాంకా వాటి ద్వారా మొత్తం వంద కోట్లను సంపాదిస్తుందని బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి హాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తున్న ప్రియాంకా తన సత్తా చాటుతుందని చెప్పాలి.


క్వాంటికో సీరీస్ లో ప్రియాంక లుక్ :


ఇక 24 కంపెనీల వాణిజ్య ప్రకటనలతోనే తాను ఇండియాలో ఉండే 40 రోజులు గడిచిపోయే అవకాశం ఉంది. మరి కెరియర్ పీక్స్ లో ఉన్న ప్రియాంకా బాలీవుడ్ సినిమా ఆఫర్లు వస్తున్నా వాటిని అసలు పట్టించుకునే తీరికలో కూడా లేదట. సో మొత్తానికి ప్రియంకా ఓ హాలీవుడ్ స్టార్ అయ్యిందన్నమాట. ఇలానే మరిన్ని ప్రాజెక్ట్స్ చేసి హాలీవుడ్ ధృవ తారలా ప్రియాంకా చోప్రా వెలగాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: