తెలుగు అమ్మాయి అయ్యుండి శ్రీ దివ్య కోలీవుడ్లో తన సత్తా చాటుతుంది. అక్కడ ఈ అమ్మడికి ఓ స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉందంటే నమ్మాలి.. మనసారా సినిమాలో నటించి ఆ తర్వాత తమిళంలోకి వెళ్లిన ఈ భామ తెలుగు సినిమాలపై మోజు ఇంకా పోలేదు అనుకుంటా.. ఎంతైనా మతృ భాషలో చేయాలని ఎవరికైనా ఉంటుంది కదా.. కాని తను చేసే మంచి పాత్రలు రావట్లేదని అంటుంది శ్రీ దివ్య.


పెన్సిల్ సినిమాలో శ్రీదివ్య :


తను చేయగల పాత్రతో అవకాశం వస్తే తానే తప్పకుండా ఎగిరి గంతులేసుకుంటూ చేస్తా అంటుంది. మరి అమ్మడి టాలెంట్ ను మనవాళ్లు గుర్తించట్లేదా లేక కావాలనే ఆమెను పక్కన పెడుతున్నారా అన్నది అర్ధం కాని విషయం. ప్రస్తుతం తమిళంలో సూపర్ క్రేజ్ సంపాదించిన శ్రీ దివ్య అక్కడ వరుసెంట సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా పెన్సిల్ సినిమాతో వచ్చిన ఆమె ఇప్పుడు రాయుడుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


తమిళంలో ఆల్రెడీ రిలీజ్ అయి హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి చిత్రంగా ఆదరణ లభిస్తుందని అంటుంది శ్రీ దివ్య. కోలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నా టాలీవుడ్ నుండి ఆఫర్లు రావట్లేదు అన్న బాధ కూడా తన మనసులో ఉన్నట్టుందీందుకే ఆమె ఇక్కడ అవకాశాలు రావడం లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది.


రాయుడు సినిమాలో శ్రీ దివ్య :


మరి తెలుగు అమ్మాయి కాదని ముంబై నుండి మోడల్స్ ను దించుతున్న మన దర్శక నిర్మాతల కళ్లకు శ్రీ దివ్య కనబడటం లేదా ఏంటో మరి. మొత్తానికైతే ఇంటె గెలిచి రచ్చ గెలవమన్న సామెతను శ్రీ దివ్య మార్చి రచ్చ గెలిచి చూపించి ఇంట గెలవాలని ప్రూవ్ చేస్తుంది. మరి త్వరలోనే అమ్మడికి తెలుగులో కూడా భారీ ఆఫర్లు రావాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: