సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఫైటింగ్ సన్నివేశాల్లో హీరోలకు డూప్స్ వాడుతుంటారు. ఎంత రిస్క్ ఫైట్స్ అయినా డూప్స్ తో హీరో అప్పిరియన్స్ వచ్చేలా చేస్తుంటారు. అయితే ఈ మద్య కాలంలో హీరోలు కొన్ని సన్నవేశాల్లో డూప్ లేకుండా నటిస్తూ తీవ్రంగా గాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపు అన్ని ఇండస్ట్రీలో చూస్తునే ఉన్నాం. తాజాగా తమిళ హీరో విశాల్ కి పెద్ద గాయం అయింది. తన కొత్త సినిమా ‘కత్తి సండై’ షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఓ ఫైటర్ అతడి మీద అటాక్ చేసే సీన్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స అనంతరం వైద్యులు కొన్ని రోజుల పాటు విశాల్ ను విశ్రాంతి తీసుకోమన్నారట. ఇక తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసే విశాల్.. గతంలో రెండు మూడు సార్లు షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కత్తి సండై’ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్.  

ఈ సినిమాలో విశాల్  సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుందిం. విశాల్ లేటెస్ట్ మూవీ ‘మరుదు’ హిట్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా ‘రాయుడు’ పేరుతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  భుజానికి గాయం కావడంతో విశాల్ ని కొన్ని రోజులు పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు కోరారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: