సమ్మర్ ఎంతో బోరింగ్ గా సాగిన ఆడియెన్స్ కు జూన్, జూలై మొత్తం సినిమాల పండుగ రాబోతుంది. అవును వరుసెంట చిన్నా పెద్ద సినిమాలన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ డేట్ కన్ఫాం చేసినవి కొన్నైతే.. మరి కొన్ని రిలీజ్ ఎనౌన్స్ చేయనివి ఉన్నాయి. ఏది ఏమైతేనేం స్కూల్స్ కు కాలేజ్ లకు వెళ్లనని మొరాయించే పిల్లలకు ఎంచక్కా ఓ సినిమా చూపించి తమను ఆనందంగా స్కూల్స్ కు వెళ్లేలా చేయండి.   


'అఆ'లో నితిన్ సమంత :


జూన్ 2 న అఆతో మొదలయ్యే ఈ సిని సంబరం రెండు నెలలు తెగ హంగామా చేయనున్నాయి. అఆకు మరుసటి రోజే సూపర్ స్టార్ కృష్ణ నటించిన శ్రీ శ్రీ సినిమా రిలీజ్ అవుతుంది. జూన్ 10న ఒక అమ్మాయి తప్పా అంటూ సందీప్ కిషన్, నిత్యా మీనన్ రాబోతున్నారు. ఇక జూన్ 17న నాని మరోసారి తాను జెంటిల్ మన్ అంటూ తన మ్యాజిక్ చేసేందుకు వస్తున్నాడు.    


జెంటిల్ మన్ లో నాని :


జూన్ 24న మెగా డాటర్ నిహారిక నటించిన ఒక మనసు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మించగా రామరాజు దర్శకత్వం వహించారు. అదే దారిలో జూలై 1నే బాబు బంగారం అంటూ విక్టరీ వెంకటేష్ తనదైన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.   


ఒకమనసులో నాగశౌర్య, నిహారిక :


ఇక ఇవన్ని రిలీజ్ కన్ఫాం అయిన సినిమాలైతే రిలీజ్ ఇంకా ఫైనలైజ్ అవ్వక జూన్ జూలైలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్లో కూడా కొన్ని సినిమాలున్నాయి. ప్రసుత్తం ఆది నటిస్తున్న సినిమా చుట్టాలబ్బాయ్.. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజినికాంత్ కబాలి సినిమా కూడా రిలీజ్ డేట్ కన్ఫాం చేసుకోలేదు.     


బాబు బంగారంలో వెంకటేష్ :


ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న రజిని కబాలి అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకాన్ని టీజర్ లోనే తెలియ చేశాడు దర్శకుడు పా.రంజిత్. వీటితో పాటుగానే సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. సో ఈ సినిమాలన్ని రిలీజ్ తో మరోసారి టాలీవుడ్ అంతా కళకలలాడుతుంది. ఆగష్టు దాకా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఈ సినిమాలన్ని ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే సూపర్ హిట్ గ్యారెంటీ అన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: