కార్పోరేట్ సంస్థలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినా వారు ప్రతిది డబ్బుతోనే ఆలోచిస్తారు అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు కావొచ్చు. అయితే ఈ లాస్ లను తమ దగ్గర పనిచేసే స్టాఫ్ మీద చూపించడం జరుగుతుంది. అందుకే కొన్ని సార్లు ఉన్నట్టుండి జాబ్స్ లో నుండి ఎంప్లాయీస్ ను తీసేస్తుంటారు. 


సైజ్ జీరోలో అనుష్క, ఆర్య :


ఇప్పుడు ఈ విషయమంతా దేనికి అంటే సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం లాస్ లను లెక్కేసుకున్న పివిపి దాదాపు వంద కోట్ల దాకా నష్టపోయాడని తెలుస్తుంది. అది ఒక్క బ్రహ్మోత్సవం గురించే కాదు సైజ్ జీరో, ఊపిరి కూడా పెద్దగా లాభాలేవి తీసుకు రాలేకపోయింది. అందుకే పివిపి తన దగ్గర పనిచేసే ప్రొడక్షన్ స్టాఫ్ ను తీసేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


అయితే వీటికి సంబందించిన కచ్చితమైన వార్తలేమి తెలియలేదు కాని వంద కోట్ల అదనపు నష్టం తన మీద బడ్డ పివిపి తన స్టాఫ్ ను కొంత తగ్గించి ఆ నష్ట పరిహారం పొందాలనుకుంటున్నాడు. ఇప్పటికే చెన్నైలోని ఆఫీస్ ఎంప్లాయీస్ కు పింక్ స్లిప్ ఇచ్చేసినట్టు సమాచారం. మరి హైదరాబాద్ లో వారికి కూడా ఇదే జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


బ్రహ్మోత్సవం ఆడియోలో పివిపి :


ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పివిపి క్షణం ఒక్కటే మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మొదటి సినిమా నుండి భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తున్న పివిపి ఏది తన పెట్టిన పెట్టుబడులకు తగ్గట్టు కలక్షన్స్ ను వసూళు చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో వచ్చిన బ్రహ్మోత్సవం అసలకే మోసం వచ్చేలా చేసింది. అంతేకాదు ఈ సినిమా ఇచ్చిన షాక్ తో పివిపి సినిమాలు తీయడం ఆపేస్తాడు అన్న రూమర్లు కూడా వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: