బాహుబలి ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి అర్ధం అయ్యేలా చేసింది. బాలీవుడ్ హీరోలకు కూడ నిద్ర పట్టకుండా చేసిన బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ షూట్లో ఉన్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా తర్వాత ఆల్రెడీ ఓ సినిమాకు ఫిక్స్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో ఓ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.


బాహుబలిలో ప్రభాస్ :


అయితే ఆ సినిమా మూడు భాషల్లో తెరకెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారట. బాహుబలితో తమిళ, హింది పరిశ్రమలో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న ప్రభాస్ ఇక నుండి అన్ని సినిమాలని కుదిరితే ట్రైలింగ్వల్ లేదా బైలింగ్వల్ లో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రభాస్ సొంత బ్యానర్ లా ఉండే యు.వి.క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


అయితే ఏప్రిల్ దాకా ప్రభాస్ ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే బాహుబలి షూటింగ్ ప్రమోషన్స్ మొత్తం ఈ ఇయర్ ఎండింగ్ దాకా పట్టే అవకాశం ఉంది. సో ప్రభాస్ సినిమా స్టార్ట్ అయ్యేది కుదిరితే ఈ సంవత్సరం చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లోనే అని తెలుస్తుంది. ఇప్పటికే బాహుబలి క్లైమాక్స్ ఫైట్ తప్ప అన్ని పనులు ముగించుకుందట.


రన్ రాజా రన్ సుజిత్ :  


సో అనుకున్న విధంగానే బాహుబలి రిలీజ్ కన్ ఫాం అయ్యేట్టు ఉంది. మరి మరోసారి మూడు భాషల్లో అదరగొట్టి బాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ కు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. సుజిత్ సినిమాలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. సబ్జెక్ట్ కూడా అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: