నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో వస్తున్న సినిమా అఆ.. సమంత కథాయికగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 2న రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్ సూపర్ హిట్ సినిమా ఇదే అంటూ సినిమా మీద అప్పుడే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇక చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తుంది. అయితే అఆ ప్రమోషన్స్ లో నితిన్ అఖిల్ సినిమా గురించి మాట్లాడి అందరికి షాక్ ఇచ్చాడు.  


అఖిల్ సినిమా ఆడియోలో మాట్లాడుతున్న నితిన్, అఖిల్ : 


నితిన్ నిర్మాతగా అఖిల్ అక్కినేని హీరోగా చేసిన మొదటి సినిమా అఖిల్.. అక్కినేని నట వారసత్వాన్ని స్టార్ ఇమేజ్ ను మోస్తాడనుకున్న అఖిల్ మొదటి సినిమాతోనే ఓ డిజాస్టర్ సినిమా ఫేస్ చేశాడు. అయితే ఆ సినిమా మిగిల్చిన కష్టాలకు నితిన్ కు సినిమా పోయిన రెండు మూడు నెలల దాకా కూడా నిద్ర పట్టకుండా చేసిందట. అఖిల్ కు మంచి సినిమాతో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసిన తనకు పెద్ద షాక్ తగిలిందని..


ఆ షాక్ నుండి తేరుకోడానికి చాలా టైం పట్టిందని అన్నాడు నితిన్. అంతేకాదు తన స్నేహితుడు అఖిల్ కు మొదటి సినిమా ఫ్లాప్ ఇచ్చాననే అసంతృప్తి ఇప్పటికి తనను వేధిస్తుందని అన్నాడు. సో ఈ లెక్కన చూస్తుంటే నితిన్ అఖిల్ తాలూఖు షాక్ నుండి ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఇక సినిమా పోయినా అఖిల్ తో తన స్నేహం మాత్రం అలానే ఉందంటూ చెప్పుకొచ్చాడు.


అఆలో నితిన్, సమంత :  


ఇక కెరియర్ లో తాను కూడా హిట్ కొట్టాల్సిన సమయం వచ్చింది. ఇష్క్ తో లైం లైట్ లోకి వచ్చిన నితిన్ లాస్ట్ రెండు సినిమాల ఫ్లాప్స్ తో మళ్లీ వెనక్కి తగ్గాడు. మరి నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో అఆ సినిమాను రాధాకృష్ణ చినబాబు నిర్మించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: