ఊహలు గుసగుస లాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాగశౌర్య యువ హీరోల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. మంచి టేస్టున్న సినిమాల్లో నటిస్తూ తీస్తున్న ప్రతి సినిమా హిట్ అందుకుంటున్న నాగ శౌర్య ఓ సినిమా ప్రమోషన్స్ విషయంలో తనని సైడ్ చేస్తున్నారన్న అసంతృప్తి తనలో మొదలైంది. తాను హీరోగా నటిస్తున్న ఆ సినిమా గురించి తనను కాకుండా కేవలం ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మెగా డాటర్ గురించే ప్రమోట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాడట.


ఒక మనసులో నాగశౌర్య, నిహారిక :


ఇంతకీ నాగశౌర్య ఏ సినిమా విషయం గురించి మాట్లాడుతున్నాడో మీకు అర్ధమయ్యింది అనుకుంటా.. అదేనండి ఒక మనసు.. మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరన్నది అసలు పట్టించుకోవట్లేదు ప్రేక్షకులు. కేవలం అందులో హీరోయిన్ గా నటించిన నిహారిక మీదే అందరిచూపు. అంతేకాదు సినిమా ప్రమోషన్ మొత్తం నిహారిక మీదే నడిపించేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్.


అలా అయితే హీరోగా నాగశౌర్యకు అన్యాయం జరిగినట్టే.. యువ హీరోల్లో మంచి డీసెంట్ సినిమాలతో హిట్లు కొడుతున్న నాగ శౌర్యకు ఇలాంటి పరిస్థితి రావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు ఒకవేళ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా నిహారిక అకౌంట్ లోనే పడేట్టు ఉంది. ప్రస్తుతం నాగ శౌర్యకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి అయ్యింది.


ఒక మనసు ఆడియో రిలీజ్ లో నాగశౌర్య :  


జూన్ 24న రిలీజ్ అవుతున్న ఒక మనసు సినిమా గ్యారెంటీ హిట్ అంటూ చిత్రయూనిట్ మంచి బరోసాతో ఉంది. సున్నితమైన భావోద్వేగాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు రామరాజు ఈ సినిమాను కూడా ఓ ప్రేమకావ్యంగా తీర్చిదిద్దారట. మరి సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 24 దాకా వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: