మెగాస్టార్ చిరంజీవి ప్రస్థావన లేకుండా సాయి ధరమ్ తేజ్ మాటలు కాని అతడి సినిమాలుకాని ఉండవు. మెగా యంగ్ హీరోలలో చిరంజీవి ఇమేజ్ ని తమ సినిమాలకు వాడుకున్న హీరోలలో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఇప్పటివరకు మెగా మేనల్లుడు సాయిదరమ్ తేజ్ చాలా గాసిప్పులకు కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా మారిన విషయం తెలిసిందే. 

ఈ నేపధ్యంలో ఈయంగ్ హీరోకి ఈమధ్య చిరంజీవి గట్టి క్లాసు పీకాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఆమధ్య ఈయంగ్ హీరో  రామ్ చరణ్ చేద్దాం అనుకున్న చిరంజీవి  సినిమాలను రీమేక్ చేసేద్దామని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చరణ్ చేద్దాం అనుకున్న చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి మెగాకాంపౌండ్ కి షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలుచేసాడు.
  
 ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధి టాలీవుడ్ టాప్ హీరోస్ లో మీకు నచ్చిన ఫేవరేట్ సినిమాలేంటి అని అడిగి నప్పుడు  ‘చిరంజీవి గారివి దాదాపు అన్నీ ఇష్టమే. కాకపోతే ‘కొండవీటి దొంగ’ ‘గ్యాంగ్ లీడర్’ చాలా స్పెషల్. అలాగే నాగార్జున గారి సినిమాల్లో ‘నిన్నేపెళ్ళాడుతా’ బాలయ్య గారి సినిమాల్లో ‘రౌడీ ఇన్సపెక్టర్’ ‘భైరవద్వీపం’ వెంకటేష్ గారి సినిమాల్లో ‘చంటి’ అంటూ చాలా చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. 

ఎలాగు ‘గ్యాంగ్ లీడర్’ అన్నారు  కదా ఆ సినిమాను రీమేక్ చేస్తే నటిస్తారా ? అని ఆ మీడియా ప్రతినిధి అడిగి నప్పుడు షాక్ అయిన సాయి ధరమ్ తేజ్ ఒక్క నిమిషం లో తేరుకుని  ‘గ్యాంగ్ లీడర్ అనేది చరణ్ చేయాల్సిన సినిమా. అది చరణ్ చేయాల్సిందే చేస్తాడు కూడా నేను అస్సలు టచ్ కూడా చేయను. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు నాకు’ అంటూ తెలివిగా తప్పించుకున్నాడు.  అంతే కాదు ''నేను చేయను చరణ్ చేస్తాడంతే'' అని మరోసారి చెప్పాడు. గతంలో ఈ సినిమా గురించి అల్లు అర్జున్ కూడా ఇదే విధంగా చెప్పిన విషయం తెలిసిందే. దీనితో ఆ ఇంటర్వ్యూ చదివిన వారికి ఈ యంగ్ హీరో  తన మేనమామ మెప్పుకోసం చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసాడు అని అనిపించడం సహజం. ఇది ఇలాఉండగా ఇప్పటివరకు ఫెయిల్యూర్ దర్శకులతో సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో  ఒక టాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలా గట్టిగా రాయబారాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: