సుప్రీం సినిమా విషయం లో మొదట మిక్స్ టాక్ ఒచ్చింది. సూపర్ హిట్ టాక్ రాలేదు. మరొక పక్క ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజే సూర్య సినిమా 24 విడుదల అవ్వడం తో థియేటర్ లలో పగిలిపోయే రెస్పాన్స్ ఒచ్చింది ఆ సినిమాకి. ఇక సుప్రీం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికల పడినట్టే అనుకున్నారు అందరూ. హక్కులు 20 కోట్ల పైగా అమ్ముడు అవడంతో బయ్యర్లు సేఫ్ జోన్ కి రావడం ఇక జరిగే పని కాదు అని విశ్లేషకులు తేల్చి పడేసారు. కానీ అంచనాలని తారు మారు చేస్తూ సుప్రీం సినిమా ఊహించని రేంజ్ ని అందుకుంది.

 

 

పబ్లిసిటీ విషయం లో కూడా ప్రొడ్యూసర్ లు సరైన జాగ్రత్తలు తీస్కోవడం తో ఇప్పుడు ఈ సినిమా లెక్కే వేరేగా కనిపిస్తోంది. సరిగ్గా వారం తరవాత విడుదల అయిన బ్రహ్మోత్సవం డిసాస్టర్ అవడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చే విషయం. గ్రౌండ్ లో ఒక్క సినిమా కూడా లేకపోవడం తో సాయి ధరం తేజ లాంటి యావరేజ్ మార్కెట్ ఉన్న హీరో దున్నేసుకున్నాడు. ఇరవైకోట్లు షేర్ ని ఈజీగా దాటేసి సాయి కెరీర్ లోనే అతిపెద్ద కలక్షన్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా చేసింది. సాయి ధరం తేజ ఇమేజ్ కంటే ఎక్కువగా సినిమాలోని కథ సినిమాకి హై లైట్ గా మారింది.

 

సాధారణ కథ ని డైరెక్టర్ మలచిన తీరు జనాలకి అద్భుతంగా ఎక్కేసింది. టాక్సీ డ్రైవర్ గా ఉన్న ఒక సాధారణ వ్యక్తి (హీరో ) ఒక చిన్న పిల్లాడి కోసం ఎలా సాహసం చేసాడు, ఎంతదూరం వెళ్ళాడు అనేది ఈ సినిమా కథ , వెరసి కేవలం హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో మాత్రమే యాభై లక్షల గ్రాస్ ని వసూలు చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. విడుదల అయిన రోజు నుంచి ప్రతీ రోజూ రెండు లక్షల చొప్పున యావరేజ్ గా ఈ సినిమా కలక్ట్ చేసింది. సాయి ధరం తేజ లాంటి చిన్న హీరో కి ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోలు మాత్రం చాలా తక్కువ రన్ లో ఇలాంటి ఫీట్ లు అందుకున్నారు. స్టార్ హీరోల తరవాత అంతటి హవా న్ని లాక్కుని తాను కూడా ఈ రకంగా స్టార్ హీరో అయిపోయాను అనిపించుకున్నాడు సాయి ధరం తేజ. అంతే కాదు మెగా ఫాన్స్ ఎప్పటి నుంచో తమ చిన్న హీరోలు అయిన సాయి , వరుణ్ తేజ్ లు ఇద్దరూ స్టార్ డం అందుకోవాలి అని చూస్తున్నారు ఈ నేపధ్యం లో సాయి వారికి కొత్త ఊరట ఇచ్చాడు అని చెప్పచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: