భారీ స్టార్ కాస్ట్, కోట్ల కొద్దీ బడ్జెట్ , అద్భుతమైన డైరెక్టర్ , సూపర్ స్టార్ హీరో , రిచ్ ప్రొడ్యూసర్ , అదిరిపోయే ప్రమోషన్ లు .. ఇవన్నీ చేసిన తరవాత కూడా సినిమా అట్టర్ ప్లాప్ అయితే సారీ డిజాస్టర్ అయితే పరిస్థితి ఏంటి ? అదే ఇప్పుడు బ్రహ్మోత్సవం పరిస్థితి కూడా అదే. ఇలాంటి సందిగ్ధత లో టీం మొత్తం సైలెంట్ అయిపోతూ ఉంటుంది. టీం లో ఉన్న ఇబ్బందులూ, ఒకరికి ఒకరంటే పడని తత్వం , తప్పు ఎవరిదీ అనే విషయం లో ఒకరిని ఒకరి తిట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. హీరో డైరెక్టర్ ది తప్పు అంటే డైరెక్టర్ ఏమో హీరో వేలు పెట్టకుండా ఉండాల్సింది అంటూ సలహాలు ఇస్తాడు. మొత్తంగా ఒక పెద్ద గందరగోళమైన వాతావరణం ఏర్పడుతుంది.

 

సినిమా అనేది హిట్ అయినా ప్లాప్ అయినా అది అందరికీ సంబంధించినది , ఏ ఒక్కరీ పొగడలే౦ - ఏ ఒక్కరినీ తిట్టలేము అనేది బుర్ర కి ఆ సమయం లో ఎక్కని కామన్ సెన్స్. కానీ బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ విషయం లో మహేష్ బాబు శైలి డిఫరెంట్ గా వుండడం హర్షణీయం. మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మారి ఆగడు , నేనొక్కడినే ల కంటే భారీ డ్రా బ్యాక్ సినిమాగా నిలిచింది బ్రహ్మోత్సవం. అయితే ఈ సినిమా విషయం లో యూనిట్ తీవ్ర క్రుంగుబాటు తో ఉంది , ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా సినిమా గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా పాజిటివ్ గా మాట్లాడలేదు. అయితే మహేష్ బాబు తన గట్స్ ని మరొక సారి ప్రూవ్ చేస్తూ " సినిమా పరాజయం నా చేతిలో నే ఉంది, దీనికి నాదే బాధ్యత - డైరెక్టర్ ని ఎవరూ అనడానికి లేదు " అని అన్నాడు అనే ప్రచారం వేగంగా సాగుతోంది.

 

ఎక్కడో పేపర్ లో అన్న వార్తని మొన్న మనం అందించగా మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం - బ్రహ్మోత్సవం యూనిట్ ని కలిసిన మహేష్ ఎవ్వరినీ డీలా పడద్దు అని కోరాడట. ఈ సినిమా కి హీరోగా మాత్రమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించిన మహేష్ బాబు కథ ఎంపిక దగ్గర నుంచీ అన్ని విషయాల్లో బాధ్యత తీసుకుని ఉండాల్సిన పరిస్థితి. అది ఫెయిల్ అవ్వడం వల్లనే సినిమా పోయింది. ఏదేమైనా డైరెక్టర్ మీదే తోసేసే ఛాన్స్ ఉన్నా కూడా రెండవ సారి కూడా మహేష్ యూనిట్ తో పర్సనల్ గా డీలా పడద్దు అని బాధ్యత తనదే అని చెప్పడం తో ఫాన్స్ కి మహేష్ మీద ఇంకా అభిమానం కొండంత అయ్యింది.

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: