నాచురల్ స్టార్ గా నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు.. హ్యాట్రిక్ హిట్స్ తో రేసుగుర్రంలా పరుగెడుతున్న నానికి హెచ్చరికలు వచ్చాయట. నాని ఎవరి జోలికి వెళ్లే రకం కాదు కదా మరి అలాంటిది నానికి ఎవరు వార్నింగ్ ఇచ్చారు అంటే.. విషయమంలోకి తనను ఫిల్మ్ నగర్ వాళ్లే హెచ్చరించారని తెలుస్తుంది. ఇంతకీ నానిని ఏ విషయమై హెచ్చరించారంటే వివరాలు ఇలా ఉన్నాయి.


జెంటిల్ మన్ సినిమాలో నాని :


ప్రస్తుతం నాని తీస్తున్న సినిమా జెంటిల్ మన్ తనను మొదటి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ మాంచి కమర్షియల్ హిట్ ఇద్దామనే ఆలోచనతో దర్శకుడు కథ చెప్పగానే నచ్చి చేశాడు. అయితే ఈ సినిమా కథ మోహనకృష్ణ ఫిల్మ్ నగర్లో ఇద్దరు ముగ్గురు దగ్గర ప్రస్థావించడం జరిగిందట. కథ విన్న వారు బాగుంది అన్నా దీన్ని చేయగల హీరో ఎవరున్నారు అనగా నాని పేరు చెప్పాడట ఇంద్రగంటి మోహనకృష్ణ.


అయితే నాని మోహనకృష్ణ ఓకే చేసిన సందర్భంలో నానికి సినిమా చేయొద్దని ఫిల్మ్ నగర్లో చాలా మంది చెప్పారట. ఇలాంటి కథలను చేస్తే కెరియర్ కష్టమవుతుంది అంటూ నానిని హెచ్చరించారట. అయితే నాని ఇవేవి పట్టించుకోకుండా దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో సినిమా చేశాడు. జెంటిల్ మన్ సినిమా ఎందుకు చూడాలి అంటూ నాని ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వార్తల్లో ఈ న్యూస్ బయటకు వచ్చింది. 


కృష్ణగాడి వీర ప్రేమ గాథలో నాని : 


మరి నానిని బెదిరించింది ఎవరో కాని అలాంటి వారికి జెంటిల్ మన్ హిట్ తో బుద్ధి చెబుతా అంటున్నాడు మన నాచురల్ స్టార్. ప్రస్తుతం కెరియర్ మంచి ఊపుమీదున్న నాని ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్నాడు. ఇక అదే క్రమంలో జెంటిల్ మన్ సినిమాలో హీరోనా..? విలనా..? అన్న సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.  మరి నాని చేసింది హిట్ సినిమానా కాదా అన్నది తెలుసుకోవాలంటే జూన్ 17 దాకా ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: