మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ విడుదల అయి 10 రోజులు దాటిపోయినా ఈసినిమా సృస్టించిన ఫ్లాప్ ప్రకంపనలు ఇంకా టాలీవుడ్ ను షేక్ చేస్తూనే  ఉన్నాయి. ఈ  సినిమాను అత్యధిక మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు 50 శాతం పైన లాసులు రావడం ఖాయం అయిపోవడంతో కనీసం ఆ లాస్ శాతం కొద్ది వరకు అయినా తగ్గించు కోవడానికి ఈసినిమా బయ్యర్లు అనుసరిస్తున్న సరి కొత్తవ్యూహం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ సినిమాకు భయంకరమైన నెగిటివ్ టాక్ వచ్చిన తరువాత ఈ సినిమా నిడివి 18 నిమషాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ‘బ్రహ్మోత్సవం’ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ యాజమాన్యాలు ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లో బోర్ సీన్స్ తీసివేశారు కాబట్టి ఆ సినిమాను ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి అంటూ వేసిన పబ్లిసిటీ పోస్టర్స్ టాక్ ఆఫ్  ది టాలీవుడ్ గా మారాయి. 

ఈ సినిమా ప్రదర్శిస్తున్న కడప జిల్లాలోని ఒక ధియేటర్  ‘ బోరింగ్ సీన్స్ తొలగించి వేయపడ్డాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడండి’ అంటూ ముద్రించిన  పోస్టర్స్ ను చూసి అసలు ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారా లేదంటే ఈ సినిమా పరువు తీస్తున్నారా? అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్పూఫ్ లతో వెబ్ మీడియా  హోరె త్తి పోతూ ఉంటే ఇక రోడ్ ల పై దర్శనం ఇస్తున్న ఈ పోస్టర్స్ ను చూసి దియేటర్స్ కు జనం ఎలా వస్తారు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా ఈమధ్యకాలంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా పై జరిగినంత నెగిటివ్ పబ్లిసిటీ మరి ఏ టాప్ హీరో సినిమా పై జరగలేదు అన్నది వాస్తవం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: