రాజకీయాలకు సంబంధించిన ఎన్నికలలో ఫేక్ ఓట్ల వ్యవహారం సర్వసాధారణంగా వినిపించే న్యూస్. అయితే సినిమా అవార్డుల ఫంక్షన్ కు సంబంధించి నిర్వహింపబడే ఫంక్షన్స్ లో ఇలాంటి ఫేక్ ఓట్ల వ్యవహారం రావడం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. జూన్ 30 జూలై 1 తేదీలలో సింగపూర్ లో ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ చాల భారీ ఎత్తున జరగబోతోంది.

ఈసారి తెలుగు సినిమాకు సంబంధించి ఉత్తమ నటుడు అవార్డ్ కోసం ఎంపిక చేసిన నామినేషన్స్ లో మహేష్ ప్రభాస్ అల్లుఅర్జున్ ల పేర్లు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖుల జడ్జి ప్యానల్ తో పాటుగా ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఈఉత్తమ నటుడు అవార్డును ఎంపిక చేస్తారు. ఇప్పటికే ‘సైమా’ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ ఆన్ లైన్ ఓటింగ్ ప్రారంభం అయింది. 

\ప్రభాస్ మహేష్ ల మధ్య బెస్ట్ హీరో అవార్డ్ కు పోటీ హెచ్చుగా ఉండటంతో వీరిద్దరిలో ఎవరూ ఉత్తమ నటుడు అవార్డులు ఎంపిక అవుతారు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. అయితే అనుకోకుండా నిన్న అల్లుఅర్జున్ ప్రభాస్ మహేష్ లను ఆన్ లైన్ ఓటింగ్ లో దాటిపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. నిన్న ఒక్కరోజే అల్లుర్జున్ కు ప్రభాస్ మహేష్ ల కంటే వేలసంఖ్యలో ఓట్లు ఒక్కరోజులోనే అధికంగా రావడం ‘సైమా’ అవార్డ్స్ కమిటీ నిర్వాహకులను ఆశ్చర్య పరిచినట్లు టాక్.  

దీనితో ‘సైమా’ సంస్థ ఈ ఆన్ లైన్ ఓటింగ్ పై క్రాస్ చెక్ చేస్తే అల్లుఅర్జున్ కు పడిన ఓట్లలో దాదాపు 30వేల ఓట్లు ఫేక్ ఓట్లని తేలడంతో ఆ ఓట్లను ‘సైమా’ ఆన్ లైన్ ఓటింగ్ సైట్ నుండి డిలీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తల్లో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించే ఆన్ లైన్ ఓటింగ్ లో కూడ ఫేక్ ఓట్లు పడ్డాయి అంటూ వార్తలు రావడం చాలామందికి షాక్ ఇచ్చింది..
.


మరింత సమాచారం తెలుసుకోండి: