వెండితెర మీద అందాలను విరజల్లే భామ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు రావడం రావడమే సక్సెస్ క్రేజ్ తో వస్తే మరికొందరు మాత్రం చేస్తూ చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదిస్తారు. అయితే ఈ రెండిటిలో వెనుకపడ్డా సరే సంపాధనలో మాత్రం కొందరు తెగ వెనకేసుకుంటుంటారు. సినిమా అవకాశాలేని సంపాదన ఎలా వస్తుంది అంటే సరిగ్గా తాప్సీను చూస్తే తెలుస్తుంది అదెలానో అంటున్నారు.


తాప్సీ వెస్ట్రన్ కల్చర్ బాగా అలవరచుకున్న ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో కూడా ఆ కల్చర్ కు ప్రాణం పోస్తూ తాను నటించే సినిమాలకో స్పెషల్ గ్లామర్ తీసుకు వచ్చింది. అయితే సౌత్ లో పెద్దగా క్రేజ్ సంపాదించలేని తాప్సి బాలీవుడ్ లో మాత్రం క్రేజ్ సంపాదించగలిగింది. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే వెడ్డింగ్ ప్లనింగ్ బిజినెస్ చేస్తున్న తాప్సి దాని ద్వారా బాగానే వెనకేస్తున్నట్టు ఉంది.


తన స్నేహితులతో పెట్టిన వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ తో తాప్సి తనకు తానుగా మంచి బిజినెస్ బ్రైన్ గా పేరు సంపాదించింది. అంతేకాదు ఈ భామ ఇప్పుడు బి.ఎం.డబల్యు కార్ ను మయింటైన్ చేస్తుంది. ఇక ఒలంపిక్స్ కు వెళ్లేందుకు ఓ లేడీ బాక్సర్ కు కూడా ఆర్ధిక సయాన్ని అందిస్తుంది తాప్సి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ఉలవచారు బిర్యాని సినిమా హింది రీమేక్ లో నటిస్తున్న తాప్సి గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది.


అయితే గోవాలో ఎక్కువ రోజులు ఉంటున్న తాప్సి అక్కడ పోర్చుగీస్ కాలం నాటి వల్లా కొనేందుకు సిద్ధమైందట. మరి తాప్సి ఎంత సంపాదిస్తే ఇలాంటి వన్ని చేస్తుంది అన్న డౌట్ వస్తుంది. సో మొత్తానికి క్రేజ్ లేకున్నా తన సంపాదనతో తోటి హీరోయిన్స్ కు షాక్ ఇస్తున్న తాప్సీ ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: