యువ హీరోల్లో నిఖిల్ పంథా వేరనే చెప్పాలి.. కొద్దిరోజులు రొటీన్ కామెడీ సినిమాలతో అలరించాలని ప్రయత్నించి విఫలమైన నిఖిల్ స్వామిరారా సినిమాతో రూట్ మార్చుకుని సరికొత్త కథా కథనాలతో హిట్ అందుకున్నాడు. అయితే ప్రయోగం చేసిన ప్రతిసారి హిట్ అందుకోవడం కష్టమే అందుకే లాస్ట్ ఇయర్ వచ్చిన శంకరాభరణం సినిమాతో కాస్త నిరాశ చెందాడు.


నిఖిల్, వి.ఐ ఆనంద్ సినిమా ఫస్ట్ లుక్ :


అయినా సరే మళ్లీ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు నిఖిల్.. బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాలో రాజేష్ గా అందరి మన్నలను పొందాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తో సోలో హీరోగా మారినా మొదట్లో కథ ఎంపిక విషయాల్లో మూస పద్ధతి ఫాలో అయ్యి దెబ్బ తిన్నాడు.


స్వామిరారా తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నిఖిల్ కోనా వెంకట్ మీద నమ్మకంతో చేసిన శంకరాభరణం కాస్త వెనకపడేలా చేసింది. అందుకే ఇప్పుడు మరో సూపర్ స్టోరీతో వస్తున్నాడు నిఖిల్. టైగర్ ఫేం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 1న టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ లోపు సినిమా మీద క్యూరియాసిటీ పెంచేందుకు ఓ సీసా పోస్టర్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. 


శంకరాభరణం సినిమాలో నిఖిల్ :


అయితే నిఖిల్ సినిమా పోస్టర్ లా వచ్చిన అది చూస్తుంటే ఓ హర్రర్ సినిమా కాన్సెప్ట్ అన్నట్టు వ్యక్తమవుతుంది. మరి నిజంగానే ఇదో హర్రర్ థ్రిల్లర్ గా వస్తుందా లేక ప్రేమ కథా అన్నది తెలియాల్సి ఉంది. హెభా పటేల్ తో పాటుగా నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: