కాజల్ నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతూ ఉంటే ఆమె క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతు ఉండటంతో ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అందుకోలేక పోయిన ఒక రికార్డును కాజల్ తన సొంతం చేసుకుని చాలమందికి షాక్ ఇచ్చింది. చడీచప్పుడు లేకుండా కాజల్ ఫేస్ బుక్ కు 2 కోట్ల మంది ఫాలోయర్స్ ఏర్పడటం ప్రస్తుతం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. 

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో కొంతమంది మాత్రం కాజల్ రికార్డులను ఇప్పటి వరకు అందుకున్నారు. కాజల్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ఉండటంతో సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కాజల్ కు ఈ రికార్డులు వచ్చి పడుతున్నాయి అనుకోవాలి. దీనితోపాటు కాజల్ తన ఫేస్ బుక్ పేజీని చాల వ్యూహాత్మకంగా నడుపుతూ  ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలు తన హాట్ ఫ్యాషన్  ఫోటో షూట్ ఫోటోలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా తన ఫేస్ బుక్ లో పెడుతూ ఉండటంతో కాజల్ కు ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది అని అంటున్నారు. 

సోషల్ మీడియాలో అసలు హీరోలతో పోలిస్తే హీరోయిన్లకే ఫాలోయింగ్ ఎక్కువ అన్నది ఓపెన్ సీక్రెట్. పెద్దగా  అవకాశాలు  లేని త్రిష లాంటి హీరోయిన్ ట్విటర్ కూడ 2 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇక క్యూట్ హీరోయిన్ సమంత గురించి  చెప్పనక్కర లేదు. ఆమె ట్విటర్ కు ఎప్పుడో 2 మిలియన్ ఫాలోయర్స్ దాటిపోయారు.

టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులు ఉన్నా పవన్ కళ్యాణ్ ట్విటర్ కు ఇంకా 1 మిలియన్ ఫాలోయర్స్ దాటకపో యినా కాజల్ లాంటి హీరోయిన్స్ కు 2 కోట్లమంది అభిమానులు ఏర్పడటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సమ్మర్ రేసుకు వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్; బ్రహ్మోత్సవం’ సినిమాలు సూపర్ ఫెయిల్యూర్స్ అయినా కాజల్ కోలీవుడ్ లో టాప్ హీరోలు అజిత్ విక్రమ్ లతో భారీ సినిమాలు చేస్తూ ఇoకా తాను టాప్ హీరోయిన్స్ రేస్ లో ఉన్నాను అంటూ సంకేతాలు ఇస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: