క్యూట్ హీరోయిన్ సమంత మీడియాతో చేసే కామెంట్స్ ఎప్పుడూ హాట్ న్యూస్ గానే మారుతూ ఉంటాయి. ‘అ ఆ’ ను ప్రమోట్ చేస్తూ సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను నటించిన ఏ సినిమా ఫ్లాప్ అయినా తాను చాల బాధపడతానని అయితే ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ మటుకు తనకు షాక్ ఇవ్వడమే కాకుండా తనకు తీవ్ర నిరాశను కలిగించింది అని కామెంట్స్ చేసింది సమంత. 


ఇదే సందర్భంలో చాలామంది తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ అధిదేవతగా తనను పిలిచే విషయం పై స్పందిస్తూ తాను త్రివిక్రమ్ కు ఆధిదేవతను కానని కామెంట్స్ చేసింది సమంత. అయితే తాను ఏ దర్శకుడు సినిమాలో నటిస్తూ ఉంటే తనను ఆదర్శకుడి అధిదేవతగా పరిగణిస్తున్నారు అంటూ మరో సెటైర్ వేసింది సమంత.

తానూ దర్శకులను చూసి సినిమాలు ఎంచుకొనని కేవలం తాను నటించే పాత్రలను చూసి మాత్రమే తన సినిమాల ఎంపిక ఉంటుంది అంటూ తన పై ఏ దర్శకుడు ప్రభావం లేదని సంకేతాలు ఇచ్చింది. ఇదే సందర్భంలో టాలీవుడ్ యంగ్ హీరోతో తనను కలుపుతూ మీడియాలో వస్తున్న వార్తల పై స్పందిస్తూ మరో లేటెస్ట్ ట్విస్ట్ కు తెర తీసింది సమంత. 

తాను ఇప్పట్లో పెళ్ళి చేసుకోను అని తాను ఇంకా చాల సినిమాలు నటించాలి అని కోరుకుంటున్నాను అంటూ తన ప్రేమ వ్యవహారం పై రేగుతున్న దుమారానికి చెక్ పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది సమంత. గత వారం ఇదే మీడియాతో మాట్లాడుతూ తనకు జీవితం బోరుకొడుతోంది అని కామెంట్స్ చేసిన సమంత ఇప్పుడు ఇలా యూటర్న్  తీసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: