పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే సూపర్ క్రేజ్. అయితే అలాంటి హీరో సినిమా ఆఫర్ వస్తే చాలు ఎగిరిగంతులేస్తూ ఒప్పుకునే హీరోయిన్స్ ఉన్న ఈరోజుల్లో పవర్ స్టార్ సినిమా అవకాశం వచ్చినా చేయనని చెప్పి షాక్ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. అసలు ఎందుకు ఆమె ఈ సినిమాకు నో చెప్పిందో వివరాలు తెలుసుకుందాం.


పవన్ కళ్యాణ్ అది పేరు కాదు ట్రెండ్ సెట్టర్.. అయితే అలాంటి క్రేజీ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే కాదన్నది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో హిట్ అందుకున్న కీర్తి సురేష్ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను తన మత్తులో పడేసుకుంది. అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ నుండి కోలీవుడ్ జంప్ అయిన ఈ చిన్నది ఇక్కడ సినిమాలను తక్కువ చూపు చూస్తుందట.


నేను శైలజ సినిమాలో కీర్తి సురేష్ :  


అంతేకాదు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమా అవకాశాలొచ్చినా సరే సారీ అని చెప్పేస్తుందట. తమిళంలో నటించిన మొదటి సినిమా హిట్ అవ్వడంతో అమ్మడికి అక్కడ కూడా సూపర్ ఇమేజ్ సంపాదించింది. అందుకే కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ తో జోడి కట్టే ఆఫర్ దక్కించుకుంది. అయితే అదే టైంలో పవర్ స్టార్ సినిమా అవకాశం వచ్చిందట.


కాని ముందు తమిళ సినిమా కమిట్ అయిన కీర్తి పవన్ సినిమాకు నో చెప్పాల్సి వచ్చిందట. మరి పవన్ సినిమా మిస్ అయినందుకు అమ్మడు బాధపడ్డదో లేదో కాని పవర్ స్టార్ తో కీర్తిని చూడలేకపోయామని అభిమానులు ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి అక్కడ బిజీ అయిన కీర్తి ఇక్కడ  భారీ ఆఫర్లను కూడా మిస్ చేసుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: