లోకోభిన్నరుచి అంటారు.. ఒక్కొక్కళ్లది ఒక్కో టేస్టు.. ఒక్కొక్కళ్లది ఒక్కో అలవాటు.. కానీ కొన్ని అలవాట్లు మరీ విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన అలవాట్లు సెలబ్రెటిలకు ఉంటే.. అంతకు మించిన ఇంట్రస్టింగ్ టాపిక్ ఏముంటుంది.. అలాంటిదే ఓ సంచలన విషయం తాజాగా వెలుగు చూసింది. ప్రముఖ హాలీవుడ్ హాట్ బ్యూటీ అరియానా గ్రాండేకు సంబంధించిన ఈ షాకింగ్ న్యూస్ ఆమే బయటపెట్టింది. 


అరియానా నటిగానే కాదు..సింగర్ గాను తానేంటో నిరూపించుకుంది. ఆమె పాటలంటే అమెరికాలో యమా క్రేజ్ ఉంది. పాటలతో.. అందాల ఆటలతో ఈ అమ్మడు అమెరికా కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. అలాంటి ఈ అమ్మడు తన విచిత్రమైన అలవాటు గురించి తాజాగా ఓ ఇంటర్వూలో బయటపెట్టింది. అదేంటంటే.. ఈ అమ్మడు పడుకోవాలంటే నగ్నంగా ఉండాల్సిందేనట.


అలా పడుకోమని వాళ్ల అమ్మమ్మ చెప్పిందట. అప్పటి నుంచి వంటి పై నూలు పోగు లేకుండా పడుకుంటోందట. అయితే ఇలాంటి అలవాటు కొంతమందిలో ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు.. కానీ.. ఆ అమ్మడు అలా నగ్నంగా పడుకునేటప్పుడు పక్కలో ఆమె పెంపుడు కుక్కలు మాత్రం ఉండాల్సిందేనట. పెంపుడు కుక్కలతో నగ్నంగా పడుకుంటానని స్వయంగా అరియానాయే బయటపెట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: