ఈ మధ్య మీడియాలో ఎక్కడ చూసినా ‘ప్రభాస్ భక్త కన్నప్ప రీమేక్ లో నటించేస్తాడూ’ అనే వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించి కృష్ణంరాజు కూడా అక్కడక్కడా మాట్లాడుతుండటంతో ఇక ఆ చిత్రం రీమేక్ అయి తీరుతుందని చాలామంది డిసైడ్ అయిపోయారు. నిజానికి ఈ చిత్రం విషయంలో ప్రభాస్ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ‘ప్రభాస్ కి భక్త కన్పప్ప చిత్రం అంటే చాలా ఇష్టం. అయితే, దాన్ని రీమేక్ చేయాలన్న ప్రతిపాదన ఇంకా అతడి ముందుకు రాలేదు. ఒకట్రెండు సందర్భాల్లో ఇంట్లో చర్చించుకున్నారు. కానీ, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుతమైతే ఆ చిత్రం రీమేక్ ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవు. అందరూ చర్చించుకుంటున్నట్టుగా ప్రభాస్ మాత్రం ఇప్పట్లో భక్తకన్నప్ప రీమేక్ చేయడు’ అన్నారు అతడి సన్నిహితుడు ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: