ఓ చిన్న సినిమా పెద్దగా సౌండ్ చేస్తుంది అంటే దాని వెనుక కచ్చితంగా పెద్ద అండ ఉందన్నది మనం గమనించాలి.. ఏం చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను పెద్దగా రిలీజ్ చేసుకోరా అంటే.. అదేం కాదు ఎంతైనా పెద్ద నిర్మాతకుండే ఆలోచనలు వేరే ఉంటాయి. తమ బ్యానర్లో రిలీజ్ అయ్యే చిన్న సినిమా అయినా సరే పెద్ద కలరింగ్ ఇవ్వడం వారికి మాములే. 


ఇంతకీ ఇప్పుడు ఏ సినిమా గురించి ఈ వివరణ అంతా అంటే.. మీకు మీరే మాకు మేమే సినిమా గురించి.. నాన్నకు ప్రేమతో లాంటి మంచి సినిమాకు కథ అందించిన హుస్సెన్ షా కిరణ్.. మొదటి సారి దర్శకత్వం వహించిన సినిమా మీకు మీరే మాకు మేమే.. సుకుమార్ మెచ్చిన ఈ రచయిత దర్శకుడిగా మారి తీసిన సినిమా ఇది. 


మీకు మీరే మాకు మేమే పోస్టర్ :


అందుకే అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాత రిలీజ్ చేయడం ఇక్కడ విశేషం. నకమా ప్లానెట్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవుతుంది. ఓ పక్క అదేరోజు నాని జెంటిల్ మెన్ అంటూ వస్తున్నా సినిమా మీద ఉన్న నమ్మకంతో పోటీగా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా మొత్తం గీతా సమర్పణలో వదలడం దీనికి ప్లస్ పాయింట్.. 


ఓ మెచ్యుర్డ్ అమ్మాయి.. మెచ్యురిటీ లేని అబ్బాయితో సాగించిన ప్రేమ ప్రయాణమే ఈ సినిమా.. తరుణ్ శెట్టి.. అవంతికా జంటగా నటించిన ఈ సినిమా ఆడియో కూడా యువతను ఆకట్టుకుంది. సినిమా ఎప్పుడో కంప్లీట్ అయినా సరైన టైం కోసం ఇప్పటిదాకా ఆగారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: