హాలీవుడ్ సినిమాలు చూసే వారికి అంటోన్ యెల్షిన్ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.. టీనేజ్ కామెడీతో పాటుగా క్రైం థ్రిల్లర్ మూవీతో హాలీవుడ్ ఆడియెన్స్ ను అలరిస్తున్న ఆంటోన్ యెల్షిన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యెల్షిన్ చనిపోయినట్టుగా తన పబ్లిసిస్ట్ జెన్నిఫర్ అలెన్ ప్రకటించాడు.  


హాలీవుడ్ సినిమాలను ముఖ్యంగా టీనేజ్ కామెడీలకు తన మార్క్ వేసుకున్న ఆంటోన్ యెల్షిన్ ఇంత త్వరగా తిరిగి రాని లోకాలకు వెళ్తాడని అభిమానులు ఊహించి ఉండరు. ప్రస్తుతం 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన యెల్షిన్ చేసిన ప్రతి సినిమాలో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసుకున్నాడు. తను చేసిన స్టార్ ట్రెక్ సినిమాల సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 


చెకోవ్ క్యారక్టర్లో తను మంచి నటనను కనబరిచాడు. యెల్షిన్ తల్లిదండ్రులు ఇద్దరు స్కేటర్లే.. రష్యాలో జన్మించిన యెల్షిన్ ఆ తర్వాత కొద్దిరోజులకే అమెరికాలో స్థిరపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన విషయం మీద నానా రచ్చ చేయాల్సిన అవసరం లేదని వారి మీడియాను హెచ్చరించారు. మొత్తానికి ఓ స్టార్ అవ్వాల్సిన యువ హలీవుడ్ నటుడు అభిమానులను విడిచి శాశ్వతంగా వెళ్లిపోయాడు. యేల్షిన్ నటించిన స్టార్ ట్రెక్ బియాండ్ మూడో సీరీస్ రానున్న జూలైలో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా మంచి పాత్ర వేశాడు.        



మరింత సమాచారం తెలుసుకోండి: