విశ్వ విఖ్యాత నటులలో అగ్రగణ్యుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్. రజినీకాంత్ లాంటి బడా స్టార్ లు రాజ్యం ఏలుతున్న తరుణం లో కూడా తన విలక్షణ శైలి ఎప్పుడూ ఎక్కడా వదలకుండా సాగుతూ వచ్చాడు ఈయన. కొడుకులని హీరోలని చేసిన హీరోలు ఉన్నారు కానీ కూతుళ్ళని హీరోయిన్ లని చేసిన కమల్ హాసన్ అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచాడు కూడా.

 

మూడేళ్ళ క్రితం తన సొంత డైరెక్షన్ లో , తనే హీరోగా నటించిన విశ్వరూపం విడుదల చేసి సూపర్ హిట్ కొట్టిన కమల్ ఇప్పుడు విశ్వరూపం 2 సినిమా విషయం లో భారీ సస్పెన్స్ పెడుతున్నాడు. అప్పట్లో విశ్వరూపం 1 తరవాత దాని వసూళ్లు చూసి ఆ సినిమా వెంటనే విడుదల చేసెయ్యాలి అనుకున్నారు కానీ ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్ధిక సంక్షోభం లో ఇరుక్కోవడం తో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశ లోనే ఆగిపోయింది. విశ్వరూపం తొలి భాగాన్ని తానే నిర్మించిన కమల్ రెండవ భాగం మాత్రం ఆస్కార్ రవిచంద్రన్ చేతిలో పెట్టాడు.

 

ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం బాగానే సాగినా పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరకి వచ్చే సరికి తాను అవతల నిర్మిస్తున్న 'ఐ' సినిమా మీద రవి ఎక్కువగా డబ్బులు పెట్టి విశ్వరూపాన్ని వదిలేసాడు. ఐ విడుదల తరవాత కూడా ఇదే కంటిన్యూ చెయ్యడం తో కమల్ కీ - రవి కి మధ్యన తీవ్ర వివాదాలు వచ్చాయి. ప్రస్తుతం ఆర్ధికంగా పరవాలేదు అని పొజిషన్ కి చేరుకున్న రవిచంద్రన్ మళ్ళీ ఈ సినిమా విడుదల కి ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికి గానీ వచ్చే సంక్రాంతికి గానీ విశ్వరూపం 2 రావచ్చు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: