నిహారిక ‘ఒక మనసు’ తో పోటీ పడుతూ యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి చేస్తున్న సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవంగా చూస్తే ఈ హీరోయిన్ పేరు కూడ ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే షార్ట్ ఫిలిమ్స్ చూసే వారు ఈమెను గుర్తు పడతారు. 

క్రితం సంవత్సరం విడుదలైన ‘కేటుగాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ మూవీలో నటించింది. ఆసినిమాలో 3 కోట్ల ఖర్చుతో తీసిన సంగీత్ సాంగ్ లో పెళ్ళి కూతురుగా కనిపించే అమ్మాయి చాందిని చౌదరి. అయితే ఆ సినిమా ఘోర పరాజయం చెండంతో ఈమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

ఇప్పుడు ఈ హీరోయిన్ ‘కుందనపు బొమ్మ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఏకంగా నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో పోటీగా రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఈసినిమా దర్శకుడు  వర ముళ్లపూడి పేరువినని వారు ఉండరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ కొడుకుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా జూనియర్ తో ‘నా అల్లుడు’ సినిమాకు దర్శకత్వం వహించి ఆ తరువాత తెరమరుగై తిరిగి దర్శకుడుగా తన సత్తా చాటుకోవడానికి ‘కుందనపు బొమ్మ’ ను తీర్చిదిద్ది ఏకంగా నిహారికకు షాక్ ఇస్తూ ‘ఒక మనసు’ తో పోటీగా విడుదల చేస్తున్నాడు. 

అయితే మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ ‘కుందనపు బొమ్మ’ కథ బాగుందని రాజమౌళి మెచ్చుకోవడమే కాకుండా ఈకథను సినిమాగా తీయమని రాజమౌళి ప్రోత్సహించినట్లు స్వయంగా ముళ్ళపూడి వర చెపుతున్నాడు. రాజమౌళి సర్టిఫికేట్ కీరవాణి సంగీతంతో ఒక చిన్న సినిమా ఏకంగా మెగా డాటర్ సినిమాతో పోటీపడుతూ ఉండటంతో నిజంగా ఈ ‘కుందనపు బొమ్మ’ లో అంత స్టామినా ఉందా ? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: