నిహారిక నటించిన ‘ఒక మనసు’ రేపు విడుదల కాబోతున్న నేపధ్యంలో మెగా అభిమానుల సపోర్ట్ తో ఈసినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్న అంచనాలతో నాగబాబు కుటుంబం ఉంది. మంచి దర్శకుడుగా పేరు గాంచిన రామరాజు ఒక క్యూట్ లవ్ స్టోరీగా దీనిని తీర్చి దిద్దడమే కాకుండా ఈసినిమా ‘మరో చరిత్ర’ ‘గీతాంజలి’ లాంటి సినిమాల పక్కన చరిత్రలో నిలిచి పోతుంది అంటూ ఈ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాడు.  

ఈ విషయాలు కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ వరకు చేరినట్లు ఉన్నాయి. అందుకనే ఈసినిమా మొదటిరోజు మొదటి షో చెన్నైలో చూస్తానని ధనుష్ తన సన్నిహితులతో చెపుతున్నట్లు సమాచారం.

అయితే ధనుష్ ఈ మూవీకి కనెక్ట్ అవడానికి కారణం నీహారిక కాదట. ఈసినిమాలోని నాగశౌర్య  హీరో కేరక్టరైజేషన్ ఈ తమిళ హీరోకు నచ్చిందని టాక్.‘ఒక మనసు’ లో హీరో పాత్ర ల్యాండ్ సెటిల్ మెంట్స్ చేస్తూ ఎమ్.ఎల్.ఎ. అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక మెడికోతో లవ్ లో పడే పాత్ర పేరే సూర్య. ఈ పాత్రను నాగశౌర్య చేస్తున్నాడు. ఈ కేరక్టర్ ధనుష్ కి విపరీతంగా నచ్చిందట. ఈసినిమా తనకు నచ్చితే వెంటనే తమిళoలో రీమేక్ చేసే ఉద్దేశ్యంలో ధనుష్ ఉన్నాడని టాక్.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నిహారిక కోలీవుడ్ ఎంట్రీకి కూడ ధనుష్ సహకరించే వ్యక్తిగా మారతాడేమో చూడాలి. ఇదిఇలా ఉండగా ఈసినిమా దర్శకుడు రామరాజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. ఈసినిమా షూటింగ్ సమయంలో నిహారికను ఎవరైనా ‘నిహా’ అని పిలిస్తే ఆమె పలికేది కాదట. కానీ వెంటనే ‘సంధ్య’ అని పిలిస్తే మటుకు వెంటనే స్పందించేదట ఈమెగా డాటర్. ఇంత ఇన్వాల్వ్ అయి ఈమె చేసిన ఈ నటనకు ప్రేక్షకులు ఎటువంటి తీర్పును ఇస్తారో రేపు తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: