చిన్న సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ని సాధిస్తే ఆ సంతోషం మామూలుగా ఉండదు. పెట్టిన పెట్టుబడికి దాదాపు లెక్కకు మించిన లాభాలు వస్తే ఆ నిర్మాతకి కలిగే ఆనందం కూడ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రస్తుతం ఓ డబ్బింగ్ చిత్రానికి సంబంధించిన విషయంలో జరిగింది. ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ, ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన మూవీ బిచ్ఛగాడు.

బిచ్ఛగాడు మూవీ రిలీజ్ నాటికి ఫిల్మ్ ఇండస్ట్రీలోని పరిస్థితులు పూర్తిగా వేరు. ఈ మూవీకి మినిమం థియోటర్స్ దొరకటమే కష్టంగా మారింది. అలాంటిది, ఓ వైవిధ్యమైన టైటిల్ తో వచ్చి యూత్ మనస్సుని హత్తుకొని, కేవలం మౌత్ టాక్ ద్వారా హిట్ ని అందుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ మవీకి సంబంధించిన కలెక్షన్స్ ని చూస్తే...దాదాపు 20 కోట్ల రూపాయలకి చేరువలో ఉంది.

గతంలో నాని నటించిన భలే భలే మగాడివోయ్ మూవీ సక్సెస్ తో పోలిస్తే...ఈ మూవీ ఇంకా ఎక్కువ సక్సెస్ ని సాధించిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం‘బిచ్చగాడు’ తెలుగులో విజృంభిస్తుంది. విజయ్ ఆంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ శ్రీనివాస రావుగారు తెలుగులో రిలీజ్ చేశారు. కేవలం 60 లక్షల రూపాయలను ఈ మూవీపై చదలవాడ శ్రీనివాసరావు ఖర్చు చేశారు.

కానీ ఇప్పుడు ఆ మూవీ 20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ రేంజ్ సక్సెస్ ఈ మధ్య కాలంలో ఏ మూవీకి లేదనే చెప్పాలి. తాజాగా వచ్చిన జెంటిల్ మెన్ చిత్రం సైతం బిచ్ఛగాడు కంటే సక్సెస్ ని అందుకోలేదనే చెప్పాలి. బిచ్ఛగాడు సక్సెస్ ని చూసిన చాలా మంది నిర్మాతలు, ఈ తరహా కథలని తయారు చేసుకోవటం ఇప్పటికే మొదలు పెట్టారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: