ఈరోజు విడుదల అవుతున్న నిహారిక ‘ఒక మనసు’ కోసం ఆ సినిమాను నిర్మించిన ఒక ప్రముఖ ఛానల్ నిన్న అంతా భీకరమైన పబ్లిసిటీతో ‘ఒక మనసు’ విడుదలను ఒక సంచలన వార్తగా మార్చి విపరీతమైన పబ్లిసిటీతో ఛానల్ ప్రోగ్రామ్స్ తో ఆదరగోట్టింది. మిగతా ఛానల్స్ ప్రింట్ మీడియా ద్వారా కూడా ఈసినిమా ప్రమోషన్ బీభత్సంగా చేసేస్తున్నారు. 

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్‌ కావడంతో నిహారిక సినిమాపై విపరీతమైన ఫోకస్‌ ఏర్పడింది. నాగశౌర్య ఈ సినిమా ప్రమోషన్ లో లేట్ గా జాయిన్ అయినా నిహారికను ఆకాశానికి ఎత్తేస్తూ ఈ యంగ్ హీరో చేస్తున్న కామెంట్స్ చాలామంది మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి.  నిహారిక యాటిట్యూడ్‌నీ, పెర్ఫామెన్స్‌నీ ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నాడు. అంతేకాదు నిహారికకు ఇంత మంచి క్యారెక్టర్‌ బహుశా ఇంకెవరూ రాయలేరని తేల్చి చెప్పేస్తున్నాడు నాగశౌర్య.

అంతేకాదు తానుగతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవంతో చెపుతున్నానని ఈసినిమా విడుదల అయ్యాక అందరూ ఈసినిమాలోని నిహారిక పాత్ర గొప్ప తనం గురించి మరియు ఆమె నటన గురించి మాత్రమే మాట్లాడుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనితో ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు మాత్రం ఇంతలా నాగశౌర్య మెగా హీరోయిన్‌ని మోసేస్తున్నాడేమిటి ? అంటూ సెటైర్లు వేసుకున్నట్లు టాక్. 

అయితే కొసమెరుపుగా నాగశౌర్య మాట్లాడుతూ ఈసినిమా మొదలు కాక ముందు నిహారికను చూసి ‘ఒక మనసు’ లోని సంధ్య పాత్రకు నిహారిక సరిపోతుందా ? అని తాను వ్యక్తిగతంగా భావించానని అయితే తన అంచనాలు నిహారిక తలక్రిందులు చేసింది అని అంటున్నాడు. దీనితో మెగా హీరోయిన్ భజన డోసేజ్ ఎక్కువగా నాగశౌర్య చేయడం వెనుక కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటూ కొoదరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా అసలు ఫలితం మరి కొద్ది గంటలలో తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: