అష్టా చమ్మా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ హీరో ఫ్రెండ్ క్యారక్టర్స్ లో మంచి నటన కనబరుస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇక తాను వచ్చింది నటించడానికే కాదు డైరెక్ట్ చేయడానికి అంటూ నాగశౌర్య, రాశి ఖన్నా లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను ఎంట్రీ ఇప్పించి ఊహలు గుసగుసలాడే సినిమాతో హిట్ అందుకున్నాడు.


అయితే అవసరలా శ్రీనివాస్ ను ఎవరు ఎలా అవసరం పడితే అలా వాడేస్తున్నారు. అదెలా అంటే సినిమాలో ఏ చిన్న రోల్ అయినా సరే కాదనకుండా చేస్తున్న అవసరలా శ్రీనివాస్ అందరికి అవసరమవుతున్నాడు. కంచె లో భారత సైనికిడిగా కనిపించిన అవసరాల శ్రీనివాస్ నాన్నకు ప్రేమతోలో ఎన్.టి.ఆర్ బ్రదర్ లా ఆకట్టుకున్నాడు.


ఇక నిన్న మొన్నటి జెంటిల్ మన్ సినిమాలో అవసరాలలోని విలన్ యాంగిల్ ను బయట పెట్టాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఓ పక్క డైరక్షన్ మరో పక్క యాక్టింగ్ ఇలా రెండు సమపాళ్లలో చేసుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇక తన దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా జ్యో అచ్యుతానంద.


నాగశౌర్య, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. అందరికి అవసరమైన ఈ అవసరాల శ్రీనివాస్ అవసరమైనప్పుడు అందరు తనకు కూడా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాడు. సో మొత్తానికి ఓ నటుడిగా ఓ దర్శకుడిగా అవసరాల ఫుల్ బిజీ షెడ్యూల్ తో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: