ఈరోజు ఉదయం విడుదలైన ‘ఒక మనసు’ మొదటిరోజు మొదటి షో ఇంకా పూర్తి కాకుండానే ఈసినిమా పై అమెరికా టాక్ బయటకు వచ్చింది. సెటిల్‌మెంట్‌లు చేసే పొలిటికల్ లీడర్ గా నాగశౌర్య గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్‌గా  నిహారిక తమతమ పాత్రలలో ఒదిగిపోయారని ఈసినిమాను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

పక్కింటి అమ్మాయిల అమాయకంగా నిహారిక చేసిన నటనకు ఓవర్సీస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా నేరేషన్ స్లోగా సాగినా, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా  వుండడంతో మూవీ చూసిన ప్రేక్షకులు మంచిమార్కులే వేస్తున్నారు. డైరెక్టర్ రామరాజు ‘ఒక మనసు’ ద్వారా యూత్ ను ఆ కట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అమెరికా టాక్ ప్రకారం ‘ఒక మనసు’ ఓవర్సీస్‌ హిట్ అని అంటున్నారు. దర్శకుడు రామరాజు ఈసినిమాను తెరకెక్కించిన విధానం అదేవిధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎమోషన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ‘నిన్న లేనంత.. మొన్న లేనంత’, ఓ మనసా అన్న సాంగ్స్‌‌ కు ఓవర్సీస్ ప్రేక్షకులు ఫిదా అయినట్లు తెలుస్తోంది

పాటల్లో నిహారిక, శౌర్యల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది అని ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్లాక్‌లో మెయిన్‌స్టోరీని చెప్పడంతో సామాన్య ప్రేక్షకులకు కూడ ఎటువంటి అయోమయం లేకుండా సినిమా నడిచింది అని అంటున్నారు. అయితే సెకండ్ ఆఫ్  స్క్రీన్ ప్లే  డ్రాగింగ్‌ గా ఉండటంతో మాస్ ప్రేక్షకులకు ఈసినిమా ఎంత వరకు నచ్చుతుంది అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో ఈసినిమాకు వచ్చే టాక్ ను బట్టి ఈ సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు మన ఇరు రాష్ట్రాలలో ఈసినిమా ప్రదర్శింప బడుతున్న ధియేటర్ల వద్దకు మెగా అభిమానులు ఈరోజు ఉదయం బాగా రావడంతో నిహారిక ‘ఒక మనసు’ కు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: