తెలుగు సినిమా గతినీ - జతినీ మార్చేసిన డైరెక్టర్ లలో దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఒకరు. ఆయన సినిమాల్లో రోమాన్స్ ని ఎంత బాగా చూపించాగాలరో భక్తి రసం కూడా అంతే గోప్పగా చూపించగలరు ఆయన. అన్నమయ్య రామదాసు షిర్డీ సాయి లాంటి భక్తి సినిమాల తరవాత నాగార్జున తో తీస్తున్న మరొక చిత్రం నమో వేంకటేశ. ఈ మూడు సినిమాలకీ మ్యూజిక్ ని ఇచ్చిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తూ ఉండడం విశేషం.

 

నమో వేంకటేశ అంటూ వీరు ముగ్గురూ నాల్గవ సారి కలవడం మరొక అద్భుత భక్తి కావ్యానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ రేపు ఉదయం ప్రారంభం కాబోతోంది. తన గడ్డం లేని ఫోటో ని ట్విట్టర్ లో పెట్టారు రాఘవేంద్ర రావు. ఎప్పుడూ గడ్డం తో ఖద్దర్ చొక్కా తో కనపడ్డం రాఘవేంద్రరావు కి అలవాటు. చాలా తక్కువ సార్లు ఆయన గడ్డం లేకుండా కనపడతారు. తనని ఇష్టపడే వారికి, తాను ఇష్టపడే వారికి మాత్రమే గడ్డం లేకుండా కనిపిస్తారు రాఘవేంద్రరావు. ఇప్పుడు మళ్ళీ ఆయన గడ్డం ఎందుకు తీసారు అనే చర్చ జరుగుతోంది.

 

 గడ్డం లేని ఫోటో పెట్టి దాంతో పాటు ఒక విశేషం పోస్ట్ చేసారు ఆయన . " జ్యోతి సినిమా అప్పుడు నుంచీ ఒక సాంప్రదాయం మొదలు పెట్టా , అప్పటి నుంచీ నా సినిమా మొదలైన ప్రతీ సారీ గడ్డం తీసేసి షూటింగ్ పూర్తి అయ్యే వరకూ పెంచుతాను. అదే ఈ సినిమాకి కూడా కొనసాగిస్తున్నాను , నాగార్జున - కీరవాణి లతో కలిసి ఇన్ని సార్లు పనిచెయ్యడం చాలా సంతోషంగా ఉంది " అన్నారు రాఘవేంద్ర రావు. రాఘవేంద్రరావు శిష్యుడు అయిన రాజమౌళి కూడా ఇదే ఫాలో అవ్వడం విశేషం. ఆయన అన్ని సినిమాలకీ ఇదే చేస్తారు. మొదటి సినిమా నుంచీ ఇదే అలవాటు. అయితే బాహుబలి సినిమా కి ఎక్కువ సమయం పట్టడం తో చాలా గడ్డం పెరిగిపోయింది ఆయన కి .


మరింత సమాచారం తెలుసుకోండి: