మెగా స్టార్ చిరంజీవి తన ‘కత్తిలాంటోడు’ షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడ ఆ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నిన్నరాత్రి  సునీల్ ‘జక్కన్న’ మూవీ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా వచ్చి సునీల్ ను ఆశ్చర్య పరిచే కామెంట్స్ చేసాడు. టాలీవుడ్ యంగ్ హీరోలలో టాప్ డాన్సర్స్ ఎవరూ అంటే ముందు వరసలో నిలిచే జూనియర్ ఎన్టీఆర్ అల్లుఅర్జున్ రామ్ చరణ్ లతో సునీల్ ను పోలుస్తూ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

టాలీవుడ్ కింగ్ ఆఫ్ డాన్స్ గా పేరు గాంచిన చిరంజీవి సునీల్ గురించి మాట్లాడుతూ తన స్వయం కృషితో కమెడియన్ స్థానం నుండి హీరోగా ఎదగడమే కాకుండా సిక్స్ ప్యాక్ హీరోగా కూడ మారిన సునీల్ తన డాన్స్ విషయంలో చూపెట్టే టాలెంట్ తనకు బాగా నచ్చుతుందని అంటూ సునీల్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ప్రస్తుత తరం యంగ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ గా సునీల్ తన స్థానాన్ని టాప్ యంగ్ హీరోల డాన్సింగ్ స్కిల్స్ తో సమానంగా కొనసాగిస్తూ ఉండటం తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందని సునీల్ పై ప్రశంసలు కురిపించాడు మెగా స్టార్. 

చిరంజీవి కురిపించిన ప్రశంసలకు సునీల్ ఆనందo హద్దులు దాటిపోయింది. అయితే చిరంజీవి కామెంట్స్ విన్న వారు మాత్రం మెగా స్టార్ తన 150వ సినిమాలో సునీల్ కు అవకాశం ఇవ్వకుండా షాక్ ఇచ్చినా ఆలోటును ఈ ప్రశంసలతో పూడ్చేసాడు అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన కొందరు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. 

ఇక పోతే నిన్న విడుదలైన ఈసినిమా లేటెస్ట్ టీజర్ ను చూసిన వారు మాత్రం సునీల్ ‘జక్కన్న’ లో ఫైట్స్, ఫన్, రొమాన్స్, గ్లామర్, కామెడీ ఇలా అన్నీ ఈసినిమాలో ఈ కళలు అన్నీ చూపెట్టి ఎదో విధంగా హిట్ కొట్టాలని సునీల్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: