నిన్న విడుదలైన ‘ఒక మనసు’ రిజల్ట్ కోసం మెగా డాటర్ నిహారిక కంటే ఎక్కువ టెన్షన్ పడ్డాడు నాని. దీనికి కారణం క్రితం వారం విడుదలైన నాని ‘జెంటిల్ మన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మొదటి మూడు రోజులు మంచి కలక్షన్స్ ను రాబట్టినా ఆ తరువాత మన ఇరు రాష్ట్రాలలోని చాల సెంటర్లలో ఈ సినిమా కలక్షన్స్ నెమ్మదిగా తగ్గాయి. 

దీనితో నానీకి మాస్ ప్రేక్షకులలో ఇమేజ్ లేకపోవడంతో నానీ సినిమాలకి హిట్ టాక్ వచ్చినా కలక్షన్స్ పరంగా నిలదొక్కుకో లేకపోతున్నాయి అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. అయితే నిన్నటి నుంచి ‘జెంటిల్ మన్’ సినిమా విడుదలై రెండవ వారంలోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో ఈ వీక్ ఎండ్ కలక్షన్స్ పరంగా ‘జెంటిల్ మన్’ పరిస్థితి నిహారిక ‘ఒక మనసు’ టాక్ బట్టి ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపించాయి.

దీనితో నాని ‘ఒక మనసు’ రిజల్ట్ కోసం చాల ఆత్రంగా ఎదురు చూసినట్లు టాక్. నిహారిక తొలి ప్రయత్నానికి ప్రేక్షకుల నుండి చెప్పుకోతగ్గ స్పందన రాకపోవడంతో ఈ వీకెండ్ తరువాత ‘ఒక మనసు’ కలక్షన్స్ చాల భారీగా పడిపోతాయి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో ఇక చెప్పుకో తగ్గ సినిమాలు ఏమి లేకపోవడంతో పాటు ‘అ ఆ’ స్పీడ్ చాల వరకు తగ్గిన నేపధ్యంలో ఈ వీకెండ్ తో పాటు రాబోయే వారం అంతా నాని ‘జెంటిల్ మన్’ హడావిడి తప్ప మరే సినిమా హడావిడి కనిపించే ఆస్కారం లేదు అని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తూ ఉంటే నిహారిక నెచురల్ స్టార్ నానీకి లైఫ్ లైన్ ఇచ్చింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా ‘జెంటిల్ మన్’ నిహారిక వల్ల గట్టెక్కింది అనుకోవాలి. సామాన్యంగా హీరోలు తమ సినిమాలు సక్సస్ కావాలని పూజలు చేస్తూ ఉంటారు. కాని అనుకోకుండా నిహారిక ‘ఒక మనసు’ గురించి నాని నెగిటివ్ గా చేసిన ఆలోచనలు వాస్తవ రూపం దాల్చి నానీకి  కలిసి వస్తూ ఉండటంతో నాని మనసులో అనుకున్న శాపం ఫలించింది అంటూ నాని పై సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: