ఈ మద్య కాలంలో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణ ట్రాఫిక్ సిబ్బంది చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. చట్టానికి అందరూ సమానమే అన్నట్లు  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎలాంటి వారు పట్టుబడినా నిర్మోహమాటంగా జరిమానా విధిస్తున్నారు. ఇక అయితే  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు సెలబ్రెటీలు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలు, వైద్యలు, రాజకీయ నాయకులు వారి సంతానం పట్టుపడటం విశేషం. ఆ మద్య అమ్మ రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి దీనిపై మీడియాలో మరింత ఫోకస్ అయ్యింది.

ఇక ఈ కేసులు గనక ఒక్కసారి సెలబ్రెటీ బుక్కయ్యాడంటే వారి గురించి మీడియాలో టాం..టాం అవుతుంది. ఈ భయంతో ఈ మద్య కాలంలో  డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో పట్టుబడుతున్నామని తెలిసి చాలా మంది కంట్రోల్ గానే ఉంటున్నారు. తాజాగా  జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంగ అండ్ డ్రైవ్‌లో ఓ బుల్లితెర నటుడు పట్టుబడ్డాడు.  

నిన్నరాత్రి  డ్రంగ అండ్ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సమయంలో నటుడు భరణి తాగి కారు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్లకు దొరికిపోయాడు.  యన 41 శాతం మేర మద్యం సేవించినట్లు బ్రిత్ ఎనలైజింగ్‌లో తేలింది.  పలు ప్రముఖ సీరియల్స్లో నటించిన భరణి కొన్ని సినమాల్లో సైతం నటించాడు. ఈ సందర్భంగా పోలీసులు కేసునమోదు చేసి ఆయన కారును సీజ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: