నిన్న రిలీజ్ అయిన ఒక మనసు సినిమా టాక్ ఎలా ఉన్నా అందులో నటించినందుకు మొదటి సినిమాగా నిహారికకు.. సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నాగశౌర్యకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఇప్పటికే సిని విమర్శకుల నుండి సినిమా గురించి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక సినిమాలో రామరాజు రాసిన డైలాగులు థియేటర్లో కన్నా బయట మనసుని తాకుతున్నాయి.. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.  


రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, శరీరాలు కాలిపోతాయి, క‌ట్ట‌డాలు కూలిపోతాయి. కానీ మ‌న‌సులో రాసుకున్న క‌థ‌లు శాశ్వ‌తంగా ఉండిపోతాయి.. సూర్య, సంధ్యతో అనే ఈ డైలాగ్ విన్నప్పుడు మనసుని తాకుతుంది.. మదిలో రాసుకున్న ప్రేమ కథలు శాశ్వతంగా ఉంటాయంటూ చెప్పే క్రమంలో సూర్య అదే నాగశౌర్య చెప్పిన ఈ డైలాగ్ మనసుతో వింటే అర్ధమవుతుంది.


ఇక ఒక మనసులో సంధ్య పాత్ర చెప్పే రెగ్యులర్ డైలాగ్.. నీ మీద ప్రేమ చావ‌దు, మ‌రొక‌రి మీద ప్రేమా పుట్ట‌దు.. ప్రేమ ఒకరి మీదే పుడుతుంది.. అంతే కాదు అలా మనసులో పుట్టిన నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు అనేది డైలాగ్.. ఇది కూడా మనసుతో వినాలనిపించే మాట. మన అనుకున్న వారికి చెప్పే మాట. 


ఒక మనసులో హీరో ఓ పొలిటిషియన్ అవ్వాలనుకునే వ్యక్తి.. తన కోసం కాకపోయినా తండ్రి కోసం ఆ తపన పెరుగుతుంది. ఇక హీరోయిన్ కేమో రాజకీయ నాయకులంటే నచ్చదు.. ఆ సందర్భంలో వచ్చే మాట.. రాజ‌కీయ నాయ‌కులంటే రాక్ష‌స జాతేమీ కాదు, ప్రతీ ఇంట్లోనూ రాజ‌కీయం ఉంటుంది, ర‌క్త సంబంధంలోనూ కుట్ర‌లు, కుతంత్రాలు, మోసాలు జ‌రుగుతున్నాయి. అవే రాజ‌కీయాలంటే.. అని చెప్పే ఈ డైలాగ్లో చాలా అర్ధముంది. బయట రాజకీయాలే కాదు ఇంట్లో ఎన్నో రాజకీయాలు జరుగుతుంటాయి అని చెప్పేలా వచ్చే డైలాగ్. ఇక ఇదే డైలాగ్ ముగిస్తూ ఎన్నో రంగుల‌ను లోప‌లే దాచుకుని, తెల్ల‌రంగును చూపించేవాడే రాజ‌కీయ‌నాయ‌కుడంటే.. అంటూ సూర్య చెప్పే మాట పొలిటిషియన్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామరాజు.  


ఇవే కాదు మనసుతో వింటే ఒక మనసులో అన్ని అద్భుతమైన డైలాగులే.. అయితే సినిమా ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్లే వారికి ఇది కచ్చితంగా నిరాశ పరుస్తుంది ఏమో కాని.. మనసుతో చూసే వారికి ఇదో దృశ్య కావ్యం అవుతుంది. అన్ని సినిమాలు కళ్ళతో ఆస్వాదిస్తాం మనసుని మనసుతో ఆస్వాదించవోయ్ అర్ధమవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: