దర్శకుడు క్రిష్  తీసిన సినిమాలలో ఇప్పటివరకు బ్లాకు బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు లేకపోయినా ఆయన తీసిన సినిమాలకు ఒక ప్రత్యేకమైన  గుర్తింపును తెచ్చుకున్నాయి. ఆ ప్రత్యేకతయే క్రిష్ ను ఒక విలక్షణ దర్శకుడిగా టాలీవుడ్ లో నిలబెట్టాయి.

ప్రస్తుతం  బాలకృష్ణ 100వ సినిమాగా ఆంధ్రుల చరిత్రను చాటి చెప్పే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను తీస్తూ సంచలనాలు సృట్టిస్తున్న క్రిష్  నిశ్చితార్థ వేడుక శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరైన  సన్నిహితుల మధ్య ఈ  వేడుక జరిగింది.  

కేర్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేసే రమ్యతో క్రిష్ కి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో  కుదిర్చిన సంబంధం ఇది అని టాక్. ఈ రోజు ఉదయం  జరిగిన  నిశ్చితార్థం వేడుకలో డాక్టర్ రమ్యకి ఉంగరం తొడిగాడు క్రిష్. త్వరలోనే వీరి పెళ్లి జరగ బోతోంది అని తెలుస్తోంది.  

‘గమ్యం’ తో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి నిర్మించిన సినిమాలలో ‘వేదం’ – ‘కృష్ణం వందే జగద్గురుమ్’ – ‘కంచె’ లాంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్న క్రిష్ తీస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ విడుదల తరువాత మాత్రమే వీరి పెళ్ళి జరగ వచ్చని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ తో క్రిష్ తీస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మోరాకో షూటింగ్ కు సంబంధించి తీసిన యుద్ధ సన్నివేశాల రషస్ చూసిన వారు క్రిష్ ఈసినిమాను ఒక అంతర్జాతీయ హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీసాడు అని కామెంట్ చేస్తున్నారు అంటే క్రిష్ ఈసినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: