టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో మోహన్ లాల్ ఎలా నటిస్తున్నాడన్న క్యూరియాసిటి ప్రేక్షకుల్లో ఎక్కువుగా ఉంది.


అయితే మోహన్ లాల్ ఈ మూవీ కంటే ముందుగానే మరో మూవీలో కనిపించనున్నాడు. మోహన్ లాల్ నటించిన ‘మనమంతా’ మూవీ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రానుంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ లాల్ అద్భుతంగా నటించాడని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న రిపోర్ట్.


ఒకవేళ ఈ మూవీ ఫలితాలు తారుమారు అయితే, మోహన్ లాల్ ని జనతా గ్యారేజ్ మూవీలో ఏ విధంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది కొరటాల శివ కి అస్సలు అర్ధం కావటం లేదు. మొదట మోహన్ లాల్ తో మాట్లాడింది, సినిమాకి ఒప్పించింది కొరటాల శివ అయినప్పటికీ, తరువాత చంద్రశేఖర్ ఏలేటి తన సినిమాకి మోహన్ లాల్ ని ఒప్పించి..జనతా గ్యారేజ్ కంటే ముందుగానే రిలీజ్ చేస్తున్నాడు.


ప్రస్తుతం మనమంతా మూవీలో మోహన్ లాల్ పాత్ర చాలా బాగుందంటూ అందరూ చంద్రశేఖర్ ఏలేటికి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే కొరటాల శివ హర్ట్ అయ్యాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మనమంతా టీమ్ అనౌన్స్ చేయనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: