తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మంచి దర్శకులుగా పేరు పొందారు అలాంటి వారిలో గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె  చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకులు క్రిష్ ఒకరు. విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు క్రిష్. త్వరలో ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డ్ గెల్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనేది క్రిష్ కల. 'కంచె' చిత్రంతో ఆ కల నెరవేరింది. ఇక తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని బుద్ధిగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు క్రిష్. ఈ రోజు చాలా సింపుల్ గా తన కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా దగ్గరి బంధు మిత్రులు విచ్చేశారు.

డైరెక్టర్ క్రిష్, రమ్య

ఘనంగా టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం
ఇక క్రిష్ కి కాబోయే భార్య పేరు రమ్య ప్రస్తుతం ఆమె వైద్య వృత్తిలో ఉన్నారు. క్రిష్ ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. నందమూరి నటసింహం బాలకృష్ణ తన భార్య వసుంధరాదేవితో సహా ఈ ఎంగేజ్ మెంట్ కి హాజరై కాబోయే దంపతులకు ఆశీస్సులు అందజేసారు.  తన తల్లి చెప్పిన మీదట రమ్యను కలుసుకున్నాడట క్రిష్.  కంచె సూపర్ హిట్ తర్వాత ప్రస్తుతం క్రిష్ .. నందమూరి బాలకృష్ణ 100 చిత్రం అత్యంత  ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు. ఆంధ్రదేశ చరిత్రంలో గొప్ప పేరు సంపాదించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ జరుగుతుంది. 


టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ జాబితాలో ప్రభాస్, నితిన్, తరుణ్, సాయిధరమ్ తేజ్ ఉన్నారు. దర్శకుల జాబితాలో ముందుగా క్రిష్ పేరు ఉంది. ఈ నిశ్చితార్గంతో ఓ డైరెక్టర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు ఆశిస్సలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: