హీరోయిన్ కావాలంటే కాస్త అందం అభినయం ఉంటే చాలు సరాసరి ఏ సినిమా ఆఫీస్ కు వెళ్లినా అవకాశాలు వచ్చినట్టే. అయితే మొదటిది ఎలాగోలా వచ్చినా ఆ సినిమాలో అందానికి తప్ప అభినయానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు దర్శకులు అందుకే అలాంటి అవకాశం ఇవ్వకుండా తన నటించాలనే కోరికను షార్ట్ ఫిలింస్ తో తీర్చుకుంటూ ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుంది చాందిని చౌదరి.


యూట్యూబ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు బ్రహ్మోత్సవంలో అలా తళుక్కుమన్నది. అయితే స్టార్ సినిమా కాబట్టి అది కూడా మహేష్ కాబట్టి ఆ సినిమా చేశా ఇక నుండి అలాంటివి చేయనని చెప్పింది. ఇక ఆ విషయం పక్కన పెడితే తన అభినయంతో వెబ్ సీరీస్ లో అదరగొట్టిన చాందిని అవకాశం వస్తే హాట్ గా కూడా కనిపించేందుకు రెడీ అంటుంది.


కేవలం నటన మీదే కాదు గ్లామర్ షో కూడా చేస్తేనే హీరోయిన్ అంటే క్రేజ్ ఉంటుందని అమ్మడు గమనించింది అనుకుంటా తనలో ఆ యాంగిల్ కూడా చూపించాలని తహ తహ లాడుతుంది. యూట్యూబ్ లో మంచి నటన కనబరిచిన చాందిని సరైన సినిమాలు మాత్రం పడలేదు. చేసిన రెండు సినిమాలు కేటుగాడు, కుందనపు బొమ్మ ఫ్లాప్ అయ్యాయి.


మరి ఈ భామను ఆదుకునే దర్శక నిర్మాతలెవరో చూడాలి. ప్రస్తుతం రెండు మూడు సినిమాల కథా చర్చల్లో ఉన్న చాందిని కుదిరితే తన స్కిన్ షో చేసేందుకు కూడా రెడీ అంటుంది. మరి స్పీడ్ మీదున్న ఈ తెలుగమ్మాయికి స్టార్ క్రేజ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: