మెగా యంగ్ హీరోకి ‘తిక్క’ వస్తే ఏం చేస్తాడో చెప్పే విధంగా సాయి ధరమ్ తేజ్ గుర్రం ఎక్కేసి ఒక చేతితో బూర ఊదుతూ మరో చేతిలో బీరు బాటిల్ పట్టుకొని చేస్తున్న హంగామాకు సంబంధించిన పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘తిక్క’ సినిమాకు సంబంధించిన ఈ మోషన్ పోస్టర్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 గతంలో ‘ఓమ్’ 3డి మూవీకి దర్శకత్వం వహించిన సునీల్ రెడ్డి ఈ సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా మలేషియాలోనే జరిగింది. లరేసా బొనేసి అనే ఫారిన్ అమ్మాయి ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 'హ్యాండిల్‌ విత్‌ కేర్‌' అనే ట్యాగ్ తో విడుదల అయిన ఈ మోషన్ పోస్టర్ చూస్తూ ఉంటే ఈసినిమా స్టోరీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనిపిస్తోంది.

తమన్ టెరిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ టాలెంటెడ్ కెమెరామ్యాన్ కె.వి.గుహన్ ఛాయాగ్రహణం ఈసినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఇప్పటికే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ .. ‘సుప్రీమ్’ .. వంటి సినిమాలో వరుస హిట్లు కొట్టి 25 కోట్ల కలక్షన్స్ హీరోగా మారిన సాయిధరమ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేశాడు.

సినిమా సినిమాకీ రేంజ్‌ పెంచుకుంటూ వెళుతున్న సాయిధరమ్‌ తేజ, 'సుప్రీం' సినిమాతో ఊహించని విజయాన్ని అందుకోవడంతో అతడి సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ కు ఎటువంటి సమస్య ఉండదు అన్న అభిప్రాయం ఏర్పడటంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు నిర్మాతలలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.  తన చిన్న మామయ్యా పవన్ కళ్యాణ్ ‘తిక్క’ ను టైటిల్ గా మార్చుకుని చేస్తున్న ఈ సాహసంలో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని కొన్ని సీన్స్ లో బాగా ఇమిటేట్ చేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: