తెలుగు ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన హీరోయిన్లకు చెల్లెలుగా, స్నేహితురాలిగా వస్తూ..కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న యంగ్ హీరోయిన్ తేజస్వి మడివాడ అందరికీ బాగా తెలుసు. ఈ అమ్మడు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో సమంత చెల్లెలుగా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాకపోయినా..రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్ క్రీమ్' చిత్రంలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. దీంతో చిన్న నిర్మాతలకు ఈ అమ్మడు కల్పతరువుగా మారిపోయింది.

 ఆ తర్వాత  తరువాత లవర్స్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, జత కలిసే వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. తేజస్వి యాక్టింగ్ కూడా చాలా బబ్లీగా ఉంటుంది..మంచి నవ్వు ఆకర్షించే ముఖంతో చూపరులను బాగా ఆకర్షిస్తుంది. వాస్తవానికి ఈ మద్య వస్తున్న హీరోయిన్లతో పోటీ పడుతు చిన్న సినిమాల్లో చాన్సులు దక్కించుకోవడం గొప్ప విశేషమే.  

ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే అందాలు ఆరబోసి గ్లామర ఉన్నంత వరకే వారిని పరిమితం చేస్తున్న ఈ రోజుల్లో హీరోయిన్ గా నెట్టుకు రావడం అంటే కష్టమైన పనే. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు తేజస్వి మరోసారి తన అందాలు బయట పెడుతుంది. ఈ చిత్రంలో బికినీ కూడా వేసిందట. అంతే కాదు స్విమ్మింగ్ పూల్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిందట. మొత్తం మీద తేజస్వి మరోసారి అందాల విందు ఖాయమనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: