టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండీగా మారిన కమెడియన్ సంపూర్ణేష్ బాబు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని కమెడియన్స్ అందరికంటే సంపూర్ణేష్ బాబుది ప్రత్యేకమైనది. తను యాక్టింగ్ కి సైతం పనికిరాడు అని చాలా మంది అంటే, ఏకంగా హీరో అయి చూపించాడు. తన వెటకారపు కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న తీరు అందరికి నచ్చుతుంది.


దీంతో సంపూర్ణేష్ బాబు సినిమాలకి ప్రేక్షకులు పెరుగుతున్నారు, థియోటర్స్ సైతం పెరుగుతున్నాయి. సంపూర్ణేష్ బాబు సినిమాలకి ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో, సంపూర్ణేష్ బాబు కి మార్కెట్ లో బాగానే డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బర్నింగ్ స్టార్ హీరోగా నటించిన పేరడీ సినిమా ’కొబ్బరి మట్ట’. ప్రస్తుతం ఈ మూవీ అటు బిజినెస్ లో ట్రెండీ గా మారింది.


మెగాస్టార్ చిరంజీవి సైతం కొబ్బరిమట్ట టీజర్ ని మెచ్చుకోవటంతో ఈ మూవీకి మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. కొన్ని ఏరియాల్లో ఎక్కువ మొత్తంలోనే ఈ మూవీని కొంటున్నారు. నైజాంలో కొబ్బరిమట్ట మూవీని దాదాపు 80లక్షలకి కొన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు యూఎస్‌లో ఈ సినిమా హక్కులను మంచి డిమాండ్ ఉంది.


ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమారు 30 లక్షల రూపాయలకు ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో సంపూర్ణేష్ బాబు కి ప్రత్యేకంగా అభిమానులు సైతం ఉన్నారు. అయితే ఈ మూవీకిసంబంధించిన మొత్తం బిజినెస్ లాభాలతో జరుగుతుంది కాబట్టి, సంపూర్ణేష్ బాబు కి దాదాపు 70 లక్షల ఆదాయం రెమ్యునరేషన్ పరంగా వచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: