రోజురోజుకు మెగా కుటుంబ సభ్యుల రాకతో సినిమా రంగం నిండి పోతోంది. మెగా యంగ్ హీరోల లిస్టుతో పాటు మెగా కుటుంబానికి చెందిన అమ్మాయిల హవా కూడ ప్రారంభం అయింది. నిహారిక హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజేవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ కు పని చేస్తోంది. ఈసినిమాకు సంబంధించి చిరంజీవి డ్రెస్ లు అన్నీ సుస్మిత డిజైన్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించడానికి అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఒక వ్యాపార వేత్తను ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న శ్రీజ విదేశాలలో మేనేజ్ మెంట్ స్టడీస్ కు సంబంధించిన ఉన్నత డిగ్రీని పొందిన విషయం తెలిసిందే.

ఇప్పుడు శ్రీజ మళ్ళీ యూటర్న్ తీసుకుని తన మెగా కుటుంబ పరపతితో నిర్మాతగా మారడానికి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆమె భర్త ప్రోత్సాహం కూడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. శ్రీజ భర్తకు సినిమాల పట్ల ఉండే ఇష్టంతో అతడు కూడ హీరోగా మారతాడు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే మెగా హీరోల సంఖ్య పెరిగి పోవడంతో శ్రీజ భర్త ఇలా వ్యూహాత్మకంగా చిరంజీవి చిన్న  కూతురును ఇలా నిర్మాతగా మెగా కుటుంబ సహకారంతో మారుస్తున్నాడనుకోవాలి. 

ఈ వార్తలే నిజం అయితే ఇప్పటికే హీరోలు హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్స్ తో నిండిపోయిన మెగా కుటుంబంలో ఒక మహిళా నిర్మాత కూడ ఎంటర్ అవుతోంది అనుకోవాలి. హైదరాబాద్ లో చిరంజీవి కొణిదల ఫిలింసిటీ అన్న పేరుతో ఒక భారీ ప్రాజెక్ట్ కట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో రోజురోజుకు పెరిగి పోతున్న మెగా కుటుంబ సభ్యుల సంఖ్యతో టాలీవుడ్ ‘కొణిదల వుడ్’ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: