ఎప్పుడూ వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ రవిబాబు, ఇప్పుడూ ఓ వైవిధ్యమైన కథాంశాన్ని తీసుకుని సినిమాగా రెడీ చేస్తున్నారు. పందిపిల్ల‌ కథాంశంపై ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుందన్న విషయం తెలిసిందే.


అయితే రవిబాబు తీస్తున్న ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం తెలుస్తుంది. రవిబాబు కి ఈ ఆలోచ‌న వచ్చిన వెంటనే స్క్రిప్ట్‌ ను త‌యారుచేయటం, ఇందుకోసం రవిబాబు చేసిన రీసెర్చ్ వంటి విషయాలు తెలుసుకుంటంటే..అందరికి చాలా ఆసక్తిగా మారింది.


కొన్ని సీన్స్ లో నిజమైన పంది, కొన్ని సీన్స్ లో యానీమెట్రిక్ సాఫ్ట్‌ వేర్‌ను ఉప‌యోగించిన పంది, మరికొన్ని సీన్స్ లో సిలికాన్‌తో చేసిన పందిపిల్ల మోడ‌ల్‌ను ఈ మూవీకి ఉపయోగించారు. ఇదిలా ఉంటే రాజమౌళి ఒకవైపు బాహుబలి సీక్వెల్ చిత్రీకరణ చేస్తూ ఉండగా, మరోవైపు ఈ పందిపిల్ల కాన్సెప్ట్ తో వస్తున్న మూవీపైనా తన క్యూరియాసిటీని చూపుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ ఎలా వచ్చాయి? అంటూ ఇప్పటికే తన చిత్ర యూనిట్ ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారంట.


అలాగే మార్చిలో ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసి కేవలం మూడు నెల‌ల్లో పూర్తి చేయటం పైనా రాజమౌళి ఆశ్ఛర్యపోయారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. ఇక రవిబాబు ఈ పందిపిల్ల కాన్సెప్ట్ తో ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోని విధంగా చూసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: