ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో నితిన్ వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. తాజాగా నితిన్ నటించిన అ..ఆ మూవీ గ్రాండ్ సక్సెస్ ని అందుకుంది. ఈ మూవీ హిట్ తో మార్కెట్ లో నితిన్ మార్కెట్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం నితిన్ రెమ్యునరేషన్ గత చిత్రం అ..ఆ కంటే ఎక్కువుగా ఉంది. అ..ఆ సక్సెస్ తరువాత నితిన్ దాదాపు 30 శాతం వరకూ రెమ్యునరేషన్ ని హైప్ చేశాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.


దీంతో నితిన్ పారితోషికం పెంచాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినపిస్తున్నాయి. ఇక పెంచిన రెమ్యునరేషన్ ని చూస్తుంటే ఒకింత షాకింగ్ లా ఉందని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. గతంలో నితిన్ తో చిత్రాన్ని చిన్న నిర్మాతలు అయినా అవలీలగా తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదనే చెప్పాలి.


కేవలం పెద్ద నిర్మాతలు మాత్రమే నితిన్ ని భరించగలరు అంటూ మార్కెట్ లో వినిపిస్తున్న టాక్స్. గతంలో 18 కోట్ల రూపాయల లోపు నితిన్ సినిమా ముగిసేది. ఇప్పుడు నితిన్ మూవీ అంటే కనీసం 25 నుండి 32 కోట్ల రూపాయలుపై మాటే. ఇదంత నితిన్ కి వస్తున్న వరుస సక్సెస్ లే కారణం అని అంటున్నారు.


ప్రస్తుతానికి నితిన్ తో వద్ద పలు కథలు ఉన్నాయి. అలాగే క్రేజీ డైరెక్టర్స్ సైతం నితిన్ కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలా ఉన్న వారిలో ఓ ఇద్దరు దర్శకులకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక రాధమోహన్ నిర్మాతగా ఓ మూవీకి ఇప్పటికే నితిన్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: