పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం  సినిమా రంగంలో టాప్ హీరోగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా  పవన్ కు ఉన్న పేరు ఆయనను టాలీవుడ్ ఎంపరర్ గా మార్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది  పవన్ వీరభిమానులలో నిహారిక ఒకరు.

ఆమె తాజాగా పవన్ పేరుని చేతిపై పచ్చబొట్టులా పొడిపించుకొని పవన్ పై తనకున్న అభిమానాన్ని నిరూపించుకుంది. మరి నిహారిక పవన్ పై అంతటి అభిమానం చూపించడం వెనుక ఒక  బలమైన కారణం ఉoది. నిహారిక 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లితండ్రులు ఆమెకు బలవంతపు పెళ్లి చేశారు. కొన్నాళ్ళ తర్వాత భర్త పెట్టె హింసలు భరించలేక తన ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 

అయితే సగం కాలిన గాయాలతో బయటపడిన ఆ పవన్ వీరాభిమాని  ప్రస్తుతం తనలాంటి వారికి అండగా నిలుస్తూ  తనలా నష్టపోయిన ఎందరికో మార్గదర్శిగా మారి అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. అయితే ఇలా ఆమె తన జీవితంలో జరిగిన పరిస్థితులను ఎదిరించి నిలదోక్కుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని  అంటోంది.

‘పవన్ కళ్యాణ్' పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవడంతో తనకు పరిస్థితులను ఎదిరించే శక్తి వచ్చి ఒకప్పుడు ఆత్మహత్యకు కూడా సిద్దపడ్డ స్థితి నుంచి నేడు తానే పదిమందికి స్ఫూర్తిగా  మారాను అంటోంది నిహారిక. సగం కాలిన గాయాలు చేసిన మచ్చలు ఇంకా పూర్తి గా మానక పోయినా ఈమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చాలా పత్రికలు ప్రముఖంగా రాస్తున్నాయి. దీనితో ప్రస్తుతం ఈమె న్యూస్ పవన్ వీరభిమానులలో హాట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ఈమె న్యూస్ ను పవన్ వీరాభిమానులు ఒకరికొకరు షేర్  చేసుకుంటూ వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఏమైనా పవన్ స్పూర్తి తో ఒక అమ్మాయి జీవితం మలుపు తిరిగింది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: