తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. సీనియర్ ఎస్టీఆర్ తర్వాత అన్నయ్య అని పిలిచేది మెగాస్టార్ ని మాత్రమే. అంతే కాదు చిరంజీవి పునాధిరాళ్లు చిత్రం నుంచి ఒక్కొమెట్టు ఎక్కుతూ స్వయంకృషితో పైకి వచ్చిన హీరో. అందుకే చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి అయితే దాదాపు అరడజను మంది హీరోలకు పైగా నే వచ్చారు. అయితే ఎవరి టాలెంట్ వారు చూపించినా బ్యాగ్ గ్రౌండ్ మాత్రం ఎప్పటికీ చిరంజీవి అని అంటారు. ఇప్పుడు వస్తున్న హీరోలు మొత్తం చిన్నతనం నుంచి మెగాస్టార్ పడుతున్న కష్టాలు సినీమా కోసం ఆయన తపన చూస్తూ పెరిగిన వారే..అంతే కాదు చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అంటే విపరీతంగా ఇష్టపడుతూ పెరిగిన వారు. ఇక సినిమా నేపథ్యంలో కుటుంబం కనుకనే చాలా మంది సినీ రంగం వైపే ఎక్కువ దృష్టి పెట్టారు. అంతే కాదు మొట్టమొదటి సారిగా మెగా కుటుంబం నుంచి నాగబాబు కూతురు నిహీరిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


అయితే చిరంజీవి అంటే అమితంగా ఇష్టపడేవారిలో అల్లు అర్జున్ ఒకరు. మామయ్య అడుగు జాడల్లో నడుస్తూ డ్యాన్స్, ఫైట్స్ లో మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షించారు. ఏ ఆడియో ఫంక్షన్లో అయినా సరే మెగాస్టార్ చిరంజీవి మహా వృక్షం అని ఆ చెట్టు కొమ్మలమే మేము అని అంటారు. అంతే కాదు ఆ మద్య పవర్ స్టార్ అభిమానులకు కూడా మంచి డోస్ ఇచ్చారు..మెగాస్టార్ అంతటి గొప్ప వ్యక్తి మాట్లాడితే మీరు పవర్ స్టార్ అంటే ఆయన మనసు నొచ్చుకుంటుంది కదా..! మేము అందరం ఆయన నీడలో ఉన్నవారమే ఆయనే లేకుండా మీ ముందు మెగా హీరోలు ఉండేవారా అని ప్రశ్నించారు.


ఇక రీసెంట్ తో మెగాస్టార్ మా టివి అవార్డ్స్ వేడుకలో డ్యాన్స్ చేశారు..అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొడుతుంటే అల్లు అర్జున్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. మామయ్య ఇండస్ట్రీ నుంచి దూరమై చాలా సంవత్సరాలు అయిన తర్వాత మరోసారి అందరి ముందు డ్యాన్స్ చేస్తుంటే ఆనందం తట్టుకోలేక ఉద్వేగంతో కన్నీళ్లు వాటంతట అవే వచ్చినట్లు కనిపిస్తున్నాయి.   బికి వస్తున్న కన్నీళ్ళ ని తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎంత ఉన్న మామయ్య అంటే అభిమానించే బన్ని తన ప్రేమ ఎంత గొప్పదో చాటుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: